అన్వేషణ సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
Anveshana Full Movie : సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తెలుగులో అరుదుగా వస్తుంటాయి. అలాంటి వాటిలో అన్వేషణ సినిమా ఒకటి. టాలీవుడ్ లో నెంబర్ వన్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మూవీ 100డేస్ వేడుక మద్రాసులో జరిగితే, కె రాఘవేంద్రరావు, జయసుధ చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు. 1984లో సితార మూవీతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వంశీ కి ఎనలేని క్రేజ్ వచ్చింది. ఎంతోమంది నిర్మాతలు వెంటపడ్డారు. 1974లో ఇంటింటి కథ అనే మూవీని సూపర్ స్టార్ కృష్ణతో నిర్మించిన ప్రొడ్యూసర్ కామినేని ప్రసాద్ కూడా కోరడంతో చిన్నప్పటి నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథలంటే ఇష్టం.
అందుకే అలాంటి సినిమా చేయాలని వంశీ అనుకున్నారు. 1978లో అపరిచిత కన్నడ మూవీ సూపర్ హిట్ కొట్టి, తెలుగులో కూడా 100డేస్ ఆడింది. అడవి బ్యాక్ డ్రాప్ లో ఆ కథ నడుస్తుంది. అదే రూట్ లో వంశీ కూడా కథ రెడీ చేసాడు. అయితే తనికెళ్ళ భరణి, యండమూరి వీరేంద్రనాధ్ వంటి వారికి పూర్తి కథ రెడీ చేసే భాద్యత అప్పగించారు. కానీ ఎవరి వెర్షన్ నచ్చలేదు. షూటింగ్ కి 10డేస్ టైం మాత్రమే ఉంది.
వంశీలో టెన్షన్ కన్పిస్తోంది. ఇక ఇందిరాగాంధీ హత్య, తర్వాత వరదల కారణంగా అరకు వెళ్లి, డైలాగులతో సహా తానే స్వయంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. హీరోగా కార్తీక్. సీతారలో చేసిన భానుప్రియ హీరోయిన్. సత్యనారాయణ, శరత్ బాబు, శుభలేఖ సుధాకర్, రాళ్ళపల్లి తదితర తారాగణం. కీలక పాత్రకు డాన్సర్ సుమతి సెలెక్ట్. ఇళయరాజా మ్యూజిక్. కెమెరా రఘు ఇలా టెక్నీకల్ టీమ్ రెడీ. 1985జనవరిలో షూటింగ్ ప్రారంభం.
ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి తిరుపతి దగ్గర తలకోన అడవిలో కొన్ని సెట్స్ వేశారు. అక్కడ దగ్గరలోని గ్రామంలో అందరూ మకాం వేసి షూటింగ్ ఎక్కువ భాగం అక్కడే తీశారు. చాలా భాగం రాత్రివేళ తీయడం, తలకోనలో షూటింగ్ చేయడం అప్పట్లో అందరినీ ఆశ్చర్య పరిచింది. 60రోజుల షూటింగ్. 15లక్షల బడ్జెట్. పోస్ట్ ప్రొడక్షన్ లో ఇళయరాజా మ్యూజిక్ చూసి వంశీ షాకయ్యాడు. 7రోజుల రీ రికార్డింగ్. భానుప్రియ సొంతంగా డబ్బింగ్. 1985మే 22న విడుదలైన ఈ మూవీని జనం కుర్చీలకు అతుక్కుపోయి మరీ టెన్షన్ గా చూసారు.
తెలుగు ఆడియన్స్ కి కొత్త అనుభూతిని అందిస్తూ స్క్రీన్ ప్లే సాగింది. విలన్ ఎవరో తెలీకుండా, క్లైమాక్స్ లో తెల్సినా సినిమాతో కనెక్ట్ అయిపోవడం ఈ సినిమా విశేషం అందుకే రిపీట్ గా ఈ మూవీ చూసారు. కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన చిన్న సినిమాగా అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసింది.