పవన్ అత్త రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే
Telugu Actress Nadhiya :సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా వచ్చిన బజారు రౌడీ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ “నదియా” సినిమా కెరీర్ లో వరుస ఛాన్స్ లతో రాణిస్తున్న సమయంలో శిరీష్ అనే ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత నదియా యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళిపోయింది.
ఇటీవలే ఇండియా కి తిరిగి వచ్చి మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.ఆమధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “అత్తారింటికి దారేది” మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.ఆ మూవీలో హీరో పవన్ అత్త పాత్రలో నటించి తన నటనతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసి “నదియా” సత్తా చాటింది. మిర్చి లాంటి సినిమాల్లో ఆమె నటన సూపర్. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న “గని” చిత్రంలో హీరో తల్లి పాత్ర చేస్తోంది. “వరుడు కావలెను” అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత గల పాత్రలో నటిస్తోంది. నదియా ఇంతకు ముందు మాదిరిగానే ప్రస్తుతం రోజుకి 2 , 3 లక్షల రూపాయలు పారితోషకం తీసుకుంటుందట.
అంతేగాక తన పాత్రకి ప్రాధాన్యత కూడా ఉండాలని కూడా దర్శకనిర్మాతలకు కుండబద్దలు కొట్టి చెబుతోందట. అయితే తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే, నదియా తన పెద్ద కూతురు ‘సనం’ ని హీరోయిన్ గా సినిమాల్లో పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. సినిమా పరిశ్రమలో తనతో సన్నిహితంగా ఉంటున్న ఓ ప్రముఖ దర్శకుడికి ఈ బాధ్యత అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. నిజానికి నదియా మలయాళ సినీ పరిశ్రమకి చెందిన నటి అయినా తెలుగులో హీరోయిన్ గా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి ఇమేజ్ తెచ్చుకుంది.