MoviesTollywood news in telugu

పూజా హెగ్డే టాలీవుడ్ సంపాదన ఏం చేస్తోందో తెలుసా ?

Telugu actress pooja hegde :చాలామంది హీరో, హీరోయిన్స్ ముందు జాగ్రత్తగా సినిమాల్లో వచ్చిన డబ్బుని వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టి, తమ భవిష్యత్తుకి ఢోకా లేకుండా చేసుకుంటున్నారు. యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఖరీదైన ఇళ్ళు కొనేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా చేరింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పూజా ఇక గత సంక్రాంతికి బన్నీతో కల్సి అల వైకుంఠపురంలో నటించి ఎనలేని క్రేజ్ సొంతం చేసుకుంది.

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన పూజా వరుస విజయాలతో ఆఫర్లు మీద ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. దానికి తగ్గట్టు రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు 2.5 కోట్ల పారితోషికం తీసుకుంటోంది. రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తూ, ప్రభాస్ సరసన నటిస్తూ ఇతర స్టార్ హీరోల సినిమాలకు సైతం సై అంటోంది. ఆర్థికంగా బాగానే ఉండడంతో తన కల నెరవేర్చుకునే పనిలో పడింది.

అదేంటంటే ఎప్పటికైనా ముంబైలోని బాంద్రా ఏరియాలో ఓ ఇల్లు కొనుక్కోవాలని పూజా హెగ్డే ఆశ. నిజానికి బాంద్రా ఏరియా అంటే పెద్ద పెద్ద సినీ తారలు, బడా వ్యాపారవేత్తలు నివసించే రిచ్చెస్ట్ ప్లేస్. అక్కడ ఒక్క ఇల్లు కొనుక్కోవాలంటే కోట్లు కావాలి. అలాంటి ఖరీదైన ప్రాంతంలో పూజా మూడు అంతస్తుల కళ్ళు చెదిరే భవంతి కొనుగోలు చేసి ఇంటీరియర్ తో సహా అత్యంత సుందరంగా తీర్చిదిద్దు తోందట. మొత్తానికి తన డ్రీమ్ ని టాలీవుడ్ సొమ్ముతో నెరవేర్చుకుంటోంది.