ఓటిటి వలన దృశ్యం సీక్వెల్ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా?
Drishyam 2 Full Movie :తెలుగులో ఆ మధ్య వచ్చిన దృశ్యం మూవీ బిగ్గెస్ట్ హిట్ అయింది. వెంకటేష్, మీనా నటించిన ఈ మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకుంది. అయితే ఇది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన దృశ్యం మూవీకి రీమేక్ గా వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో, ఆతర్వాత హిందీలో ఇంకా తమిళంలో కూడా రీమేక్ చేసి, హిట్ అందుకున్నారు. తాజాగా దృశ్యం మూవీకి సీక్వెల్ దృశ్యం 2 రూపొందింది.
నిజానికి గత ఏడాది మొదట్లోనే సినిమా పునః ప్రారంభించారు. సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే విడుదల చేయాలనుకున్నారు. కరోనా అందరినీ దెబ్బతీసినట్టే సినిమా వాళ్లకు కష్టాలు తెచ్చింది. దృశ్యం 2కి కూడా జాప్యం ఏర్పడింది. థియేట ర్లలో విడుదల చేసి ఉంటే, బాగుండేది. కానీ నిర్మాతల ఆర్థిక సమస్యల కారణంగా అమెజాన్ ప్రైమ్ కు దాదాపుగా 30 కోట్లకు అమ్మేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే మరోలా ఉండేలా పరిస్థితి ఉండేదన్న మాట ఇండస్ట్రీలోనే వినిపించడం విశేషం.
ఎందుకంటే, ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం వలన ఈజీగా 30 కోట్లకు పైగా రాబట్టేదని, ఇక ఓటీటీ లో సినిమా విడుదల చేస్తే, మరో పది కోట్ల దాకా వచ్చేదని అంచనా. నిర్మాతలు కాస్త ఓపిక పడితే, ఖచ్చితంగా మంచి వసూళ్లు వచ్చేవని అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు. పైగా ఓటీటీ లో విడుదలవ్వడం వల్ల రీమేక్ రైట్స్ కు కూడా తక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి సూపర్ హిట్ సినిమా సీక్వెల్ ను ఓటీటీ లో విడుదల చేయడం తప్పేనని, దీనివలన 15 నుండి 20 కోట్ల వరకు నష్టం వచ్చిందని టాక్ బలంగా వినిపిస్తోంది.