MoviesTollywood news in telugu

పవన్ హీరోయిన్ ఇంటి అద్దె ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Jacqueline Fernandez :జనసేన పార్టీ పెట్టాక సినిమాలు చేయడం మానేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు. కొందరి కాంబినేషన్ అంటే ఫాన్స్ కి మజా. అలాగే పవన్ – క్రిష్ కాంబినేషన్ మూవీ కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నారు. సహజంగా భారీ అంచనాలు కూడా ఉంటాయి. పైగా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నా ఎవరూ ఖండించక పోవడంతో ఆమె హీరోయిన్ గా ఫాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. దీంతో నిధి అగర్వాల్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా హీరోయిన్ అని తేలుతోంది. శ్రీలంక కు చెందిన జాక్వెలన్ ఫెర్నాండెజ్ ఇండియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చేసుకోవడంతో బాలీవుడ్ తో పాటు ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి.

దాంతో రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. దీంతో తన రేంజ్ కి తగ్గట్టు తాను ఉంటున్న ఇంటిని కూడా మార్చేసి, తాజాగా పీసీ నిక్ లు గతంలో ఉన్న ఒక విలాసవంతమైన భవనం మూడు సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఈ కొత్త ఇంటి కోసం జాక్వెలిన్ నెలకు దాదాపుగా రూ.6.8 లక్షల రూపాయలను కడుతోందట.