MoviesTollywood news in telugu

తారక్ వాడుతున్న బ్రాండెడ్ మాస్క్ ధర ఎంతో తెలుసా ?

Jr NTR Mask brand and price :సాధారణంగా సినీ సెలబ్రిటీలు కాస్ట్లీ బ్రాండెడ్ వస్తువులు వాడుతుంటారు. కార్లు, బైక్ లు, వాచీలు, షూస్, హీరోయిన్స్ అయితే డ్రెస్ లు, బాగ్ లు ఇలా ఒకటేమిటి అన్నింటా ప్రత్యేకత కనబరుస్తారు. ఇక సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఏమి వాడుతున్నారో వాళ్ళు పెట్టె పోస్టులను బట్టి తెలిసిపోతోంది. అయితే సెలబ్రిటీల కన్నా ఈ విషయంలో వాళ్ళ అభిమానులు స్పీడ్ గా ఉంటున్నారు. తమ అభిమాన హీరోలకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ వేగంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో బయట అందరికీ ఈజీగా తెలిసిపోతోంది.

ఇప్పుడు కరోనా కాలంలో కూడా బ్రాండెడ్ మాస్క్ లు వచ్చేసాయి. ఒక్కొక్కటి ఒక్కో రేంజ్ లో ఉంటోంది. మాస్కె కదా అని ఈజీగా తీసిపారెయ్యక్కర్లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ వాడుతున్న బ్రాండెడ్ మాస్క్ హాట్ టాపిక్ అయింది. తారక్ వాడే వస్తువుల గురించి ఫాన్స్ వేయికళ్లతో గమనిస్తుంటారు. అప్పట్లో రాజమౌళి కొడుకు పెళ్లికి వచ్చిన ఎన్టీఆర్ వాచ్ ఖరీదు దాదాపు 25 లక్షలకు పైగానే ఉంటుందని తేల్చారు. ఆ తర్వాత అతడు వేసుకున్న షూస్ ధర కూడా 75 వేలకు పైగానే ఉంటుందని సాక్ష్యాలతో సహా ఫోటోలను విడుదల చేసారు.

అలాగే ఇప్పుడు తారక్ పెట్టుకున్న మాస్క్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి రానుంది. తర్వాత ప్రశాంత్ నీల్, కొరటాల శివ లాంటి దర్శకులతో పని చేయనున్న తారక్.. బయట కూడా బిజీగా ఉంటున్నాడు. ఈ మధ్యే దర్శకుడు సుకుమార్ కూతురు వేడుకలో కనిపించాడు. అక్కడకి ధరించి వచ్చిన మాస్క్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఫాన్స్ లో కొందరు ఇదే మాస్క్ కొనుగోలు చేస్తున్నారట. యుఎ స్పోర్ట్స్ కి చెందిన ఈ మాస్క్ ధర సుమారు రూ 2340. దీన్ని తారక్ ధరించడంతో సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ వచ్చేసింది.