ప్రసవం తర్వాత పొట్ట కొవ్వు తగ్గించే బెస్ట్ టిప్స్
Belly fat after delivery :ప్రసవం అయిన తర్వాత పొట్ట తగ్గాలంటే కొంచెం కష్టపడాల్సిందే. గర్భం దాల్చిన తర్వాత ఎక్కువ ఆహారం తీసుకున్న తీసుకోకపోయినా బరువు పెరుగుతారు ప్రసవం అయ్యాక శరీరమంతా సన్నబడిన పొట్ట భాగంలో మాత్రం కొవ్వు పేరుకుపోయి లావుగా కనిపిస్తుంది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన పొట్ట కొవ్వు కరిగించుకోవడం కష్టమవుతుంది.
ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా పొట్ట కొవ్వు కరిగించుకోవచ్చు. ప్రసవం అయ్యాక ఆరు వారాల తర్వాత నిదానంగా చిన్న చిన్న పనులు చేయడం వాకింగ్ చేయడం వంటివి చేయాలి. ఆ తర్వాత నెలలు గడిచే కొద్దీ డాక్టర్ సూచనలతో వ్యాయామం కూడా ప్రారంభం చేయాలి
ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ యాలకుల పొడి అర స్పూన్ సోంపు వేసి బాగా మరిగించి వడగట్టి పరగడుపున తాగాలి ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా కొవ్వు కరుగుతుంది.
ఆహారం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం గా ఎక్కువసార్లు తీసుకోవాలి
పొట్ట దగ్గర నువ్వుల నూనె రాసి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కాపడం పెట్టాలి.