MoviesTollywood news in telugu

ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

child artist ammu abhirami :రాటసన్ తమిళ మూవీని తెలుగులో ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం లో రీమేక్ చేసిన రాక్షసుడు మూవీ మంచి పేరు తెచ్చుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. అయితే హీరో బెల్లంకొండ మేనకోడలి పాత్రలో నటించిన తమిళ చైల్డ్ ఆర్టిస్ట్ అమ్ము అభిరామి, తన నటనతో సినీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

గతంలో ధనుష్ హీరోగా నటించిన అసురన్, మూవీలో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడు అభిరామి వయస్సులో ఎదగడంతో ఇటీవలే తెలుగులో విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఎఫ్ సి యుకె (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) చిత్రంలో హీరోయిన్ గా చేసింది. నిజానికి ఈ చిత్రం పెద్దగా క్లిక్ అవ్వకపోయినా, హీరోయిన్ గా చేసిన అమ్ము అభిరామికి మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఈ మూవీలోని అభిరామి సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

దీంతో ఈ అమ్మడికి రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఏర్పడడంతో దర్శక నిర్మాతలు ఛాన్స్ లు ఆఫర్ చేస్తున్నారు. వరుస సినిమా ఛాన్స్ లతో హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం అభిరామి తమిళంలో ప్రముఖ దర్శక, నిర్మాత మణిరత్నం నిర్మిస్తున్న నవరస అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే మరో ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి కూడా ఇటీవలే అభిరామి కమిట్ అయిందని వినిపిస్తోంది.