MoviesTollywood news in telugu

రానా ‘విరాటపర్వం’ బడ్జెట్‌,బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

virata parvam movie Business :రాణా విరాటపర్వం సినిమా ప్రారంభం అయ్యి దాదాపుగా 3 సంవత్సరాలు అయింది. రాణా అనారోగ్యం మరియు కరోనా కారణంగా ఆలస్యం అయింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బడ్జెట్‌ చాలా తక్కువ అని తెలుస్తుంది. రాణా,సాయి పల్లవి పారితోషికాలతో కలిపి 20 కోట్ల లోపే కంప్లీట్ చేశారట.

ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా 11.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.ఇక శాటిలైట్ రైట్స్ రూపంలో ఈ సినిమాకు 7.5 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది.థియేట్రికల్‌ రైట్స్ మరియు ఇతర రైట్స్‌ రూపంలో ఈ సినిమా కు దాదాపుగా రూ.35 కోట్లకు పైగా వస్తాయని సమాచారం.

ఏప్రియల్ 30 న విడుదల అవుతున్న ఈ సినిమాలో ప్రియమణి కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావటం వలన కొంచెం బడ్జెట్ ఎక్కువ అయింది. లేకపోతే మరిన్ని లాభాలు వచ్చేవి.