సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్ ట్విట్టర్ రివ్యూ…ఎలా ఉందంటే
A1 Express Twitter Review :సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో వచ్చిన ఏ 1 ఎక్స్‌ప్రెస్ సినిమా ఈరోజు అభిమానుల ముందుకు వచ్చింది ఈ సినిమా సంవత్సరమే క్రితమే విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యం అయింది సందీప్ కిషన్ ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా కసితో ఈ సినిమా చేశాడు ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ తెరకెక్కింది ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ట్రైలర్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా హాకీ ఆటకు సంబంధించింది ఈ సినిమాలో హాకీ ఆట నుంచి సందీప్ కిషన్ బ్యాన్ చేయబడతాడు. ఈ సినిమాకి పాజిటివ్ బస్ వచ్చింది.
ఈ సినిమా రైట్ ట్రాక్‌లో దర్శకుడు తీసుకెళ్లాడని.. లవ్ ట్రాక్‌ను కథను బాగా నడిపాడని సినీ ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. సందీప్, లావణ్య, పోసాని, రావు రమేష్ నటన అదిరిపోయింది. పక్కా కమర్షియల్.. హిట్టు బొమ్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు.