MoviesTollywood news in telugu

బన్నీ ఎక్కడికి వెళ్లినా వెంట ఎవరు ఉంటున్నారో తెలుసా ?

Pushpa movie release date :టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు మంచి మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పాత్రకు తగ్గట్టుగా తన లుక్ ని మార్చుకుంటూ ఉంటాడు.అందుకే బన్నీ చేసిన సినిమాలు ఎక్కువగా విజయవంతం అవుతాయి అంతే కాకుండా డాన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కోసం అల్లు అర్జున్ లుక్ విషయంలోనే కాకుండా ఫిట్నెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అందుకే తన వెంట ఎప్పుడు ట్రైనర్ ఉండేలా చూసుకుంటున్నాడు. లొకేషన్ లో కూడా బన్నీ వెంట ట్రైనర్ ఉంటున్నాడు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటున్నాడట. ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నది.