సింగర్ మంగ్లీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?
Singer mangli Songs :జానపద పాటలు పాడుతూ లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న సింగర్ మంగ్లీ తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకుని పదవ తరగతి తర్వాతమ్యూజిక్ అండ్ డాన్స్ లో డిప్లొమా చేసింది. తెలంగాణ పల్లె పాటల ద్వారా మంగ్లీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంగ్లీ అసలు పేరు సత్యవతి. యాంకర్ అయిన తర్వాత మంగ్లీ అని పేరు మార్చుకుంది మంగ్లీ పేరుతోనే బాగా పాపులర్ అయ్యింది. మంగ్లీ పాడిన పాటలకు యూట్యూబ్లో కోట్లలో వ్యూస్ వస్తూ ఉంటాయి. మరి కొన్ని పాటలకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తాయి.
మంగ్లీ అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తాండాలో జన్మించింది. తీన్మార్ న్యూస్ ప్రోగ్రామ్ కు మంగ్లీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.మంగ్లీ పాడిన లవ్ స్టోరీ మూవీలోని సారంగ దరియా పాట బ్లాక్ బస్టర్ హిట్టైంది.ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.