వెంకటేష్ తన భార్య కోసం ఏమి చేస్తాడో తెలుసా…అది ప్రతి రోజు…!?
Hero venkatesh :మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా కలియుగ పాండవులు సినిమా తో తెలుగు సినిమాతో 1986 లోనే టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి హిట్ అందుకున్న వెంకటేష్ విభిన్న పాత్రలు ఎంచుకుంటూ విక్టరీకి కి మారుపేరుగా నిలిచాడు. వెంకీ మామ కి ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ తన ఫాలోయింగ్ కూడా పెంచుకుంటూ అందుకు తగిన విధంగా పాత్రల ఎంపిక చేసుకుంటూ విజయాన్ని నమోదుచేసుకుంటున్నాడు.
తాజాగా నారప్ప అనే సినిమాతో సమ్మర్ లో థియేటర్లలోకి రాబోతున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఫాలోయింగ్ గల స్టార్ ఎదిగితే , పనిగట్టుకుని కొందరు నెగటివ్ కామెంట్స్ స్టార్ట్ చేసేస్తారు. రకరకాల గాసిప్స్ ప్రచారంలోకి వచ్చేస్తాయి. ఇక సోషల్ మీడియా వచ్చాకా విపరీతంగా గాసిప్స్ సెలబ్రిటీల మీద వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు 35 సంవత్సరాల కెరియర్ లో విక్టరీ వెంకటేష్ మీద ఒక్క నెగటివ్ కామెంట్స్ గాని ఎలిగేషన్స్ కానీ లేవు. ఒక్క మచ్చ కూడా పడని హీరోగా ఇండస్ట్రీలో తనదైన పంధాలో వెళ్తున్నాడు.
వెంకటేష్ డబ్బున్న కుటుంబంలో పుట్టి అమెరికా వెళ్లి చదవుకోని వచ్చినా సరే, ఆకతాయి అలవాట్లు ఏవి కూడా ఆయనకు అలవాటు కాలేదు. 1985 లో చిత్తూరుకి చెందిన గన్నవరపు సుబ్బారెడ్డి కుమార్తె నీరజా తో వెంకీకి పెళ్లయింది. ఎక్కడ షూటింగ్ జరిగినా సాయంత్రానికి ఇంటికి వెళ్లి సరదాగా తన భార్యతో టైం స్పెండ్ చేయకపోతే వెంకీకి తోచదట. అన్ని విషయాలు కూడా తన భార్యతో షేర్ చేసుకుంటూ కాసేపు సరదాగా మాట్లాడ్డం అలవాటు.
ఆ మధ్య ఒక సినిమా ప్రొమోషన్ భాగంగా వెంకటేష్ తన భార్య గురించి, తనపై తనకున్న ప్రేమ గురించి బయటపెట్టాడు. నిజానికి వెంకటేష్ ఫ్యామిలీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక వెంకటేష్ భార్య నీరజ అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మినహా మిగతా హీరోల భార్యల్లా బయట ఎక్కడా కనిపించకుండా ఓ సాధారణ గృహిణిలా ఉంటారు. ఎంత లేట్ అయినా ఇద్దరు కలిసి భోజనం చేయడం అలవాటట. ఇంకా భార్య పిల్లలతో కలిసి బయటకు వెళ్లి రెస్టారెంట్ లో భోజనం చేయడం ఇష్టమని కూడా వెంకీ చెప్పుకొచ్చాడు.