MoviesTollywood news in telugu

తారకరత్న తండ్రిని ఎప్పుడైనా చూసారా…ఎన్టీఆర్ 5వ కొడుకు

TarakaRatna Father :ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ నిలబడలేరు. మొదటి నుంచీ ఇది ఉన్నదే. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి అగ్రహీరోలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో చాలా మంది హీరోలు వచ్చినా కొందరే హీరోలుగా నిలదొక్కుకున్నారు. ఇక ఆతర్వాత నుంచి వారసుల ఎంట్రీ మొదలైంది. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ అయ్యాడు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, అక్కినేని తనయుడు నాగార్జున, మూవీ మొఘల్ రామానాయుడు తనయుడు వెంకటేష్ రావడంతో ఈ నలుగురి మధ్యా పోటీ రసవత్తరంగా సాగింది. అప్పుడు కూడా కొందరు హీరోలు వచ్చినా కడవరకూ నిలబడలేదు. ఇప్పుడు వీళ్ళ వారసులు కూడా ఎంట్రీ ఇచ్చేసారు.

అలా జూనియర్ ఎన్టీఆర్, కృష్ణ తనయుడు మహేష్ బాబు, కృష్ణంరాజు సోదరుని కొడుకు ప్రభాస్, చిరంజీవి తనయుడు రామ్ చరణ్, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అర్జున్ ఇలా చాలామందే వచ్చారు. ఇంకా వస్తున్నారు. నందమూరి హరికృష్ణ తనయుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. బాలయ్య తర్వాత అంత పెద్ద అగ్రహీరోగా ఇండస్ట్రీలో వెలుగొందుతున్న హీరో తారక్ అనడంలో సందేహం లేదు. అయితే బాలకృష్ణ కూడా తన కొడుకుమోక్షజ్ఞని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించాలని చేస్తున్న ప్రయత్నం ఎందుకో ముందుకి సాగడంలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తోంది. దాంతో ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండకపోవచ్చు.
tarakaratna father
నిజానికి అప్పట్లో అయితే ఎన్టీఆర్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ హీరోగా వచ్చి మంగమ్మగారి మనవడు తో స్టార్ హీరోగా నిలబడి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక పవర్ ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికీ పవర్ ఫుల్ రోల్స్ తో అదరగొడుతున్నాడు. అయితే ఎన్టీఆర్ తనయుడు, బాలయ్య సోదరుడు మోహన్ కృష్ణ ఫోటోగ్రాఫర్ గా, ప్రొడ్యూసర్ గా ఉంటూ, తన కొడుకైన తారకరత్న హీరోగా ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించాడు.

ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు. దాంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అమరావతి సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు సాధించాడు. ఇక తారకరత్న అప్పటికే ఒక పెళ్లి అయిన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. దీనికి ఇంట్లో వాళ్ళు అంగీకరించక పోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మరీ పెళ్ళిచేసుకుని వేరుగా ఉంటున్నాడు. తారకరత్నకి ఒక కొడుకు ఉన్నాడు.