ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
Telugu actress Laila :1997 లో సినీ పరిశ్రమకు వచ్చిన లైలా ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో’అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా హిట్ అవ్వటంతో స్టార్ హీరోల సరసన నటించింది. తమిళంలో విక్రమ్, సూర్య వంటి హీరోలతో ఆడి పాడింది. పితామగన్ సినిమాలో సూర్యతో జోడి కట్టి మంచి పేరు సంపాదించింది. సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే 2006లో ఇరాన్ కు చెందిన బిజినెస్ మెన్ ను వివాహం చేసుకున్నది. ఆమె నాలుగు సంవత్సరాల పాటు సహజీవనం చేసి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.
ప్రస్తుతం లైలా దుబాయ్ లో ఉంటుంది. లైలా సినిమాల్లో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. అప్పటి తరం కథానాయికలు సిమ్రాన్, జ్యోతిక వంటి వారి బాటలో ఎంట్రీ కి సిద్ధం చేసుకుంటుంది. విలక్షణ దర్శకుడు బాలా తన కొత్త చిత్రంలో కీలకపాత్రలో నటించాలంటూ లైలాను సంప్రదించారనే వార్తలు వచ్చాయి.
ఆమె పోషించే పాత్ర ఏమిటనే విషయం మీద ఎటువంటి క్లారిటీ లేదు. అయితే త్వరలోనే లైలాను వెండితెర మీద చూడవచ్చు.
లైలా కూడా ప్రతి పాత్రను ఒప్పుకోకుండా ఆచి తూచి మంచి మంచి పాత్రలను ఎంచుకోవాలనే ఆలోచనలో ఉంది. ఆమె పిల్లలు కాస్త పెద్దవారు కావటంతో మరల నటన మీదకు మనస్సు మళ్లింది.