MoviesTollywood news in telugu

జాతిరత్నాలు సినిమా చూడటానికి 5 కారణాలు

jathi ratnalu release date :నవీన్ పోలిశెట్టి తాజా సినిమా జాతిరత్నాలు మీద జనాలు మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పైగా విజయ్ దేవరకొండ ప్రమోషన్ లో పాల్గొనడం హైలెట్. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి ఆడియన్స్ లో మంచి గుర్తింపు పొందాడు. డి ఫర్ దోపిడీ, వన్ నేనొక్కడినే మూవీస్ లో నటించిన నవీన్ పోలిశెట్టి పేరు ఏజంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీతో మారుమోగింది. అప్పట్లో చిరంజీవి హీరోగా జంధ్యాల తీసిన చంటబ్బాయి తరహాలో ప్రయివేట్ డిటెక్టివ్ గా నవీన్ ఆకట్టుకున్నాడు.

ఆతరువాత సుశాంత్ రాజపుత్ సినిమాలో బాలీవుడ్ లో సైతం తన యాక్టింగ్ తో మెప్పించిన నవీన్ పోలిశెట్టి ఇప్పుడు జాతిరత్నాలు మూవీ చేస్తున్నాడు. అను కెవి డైరెక్షన్ లో మహానటి నిర్మాత స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమా లో పలు కీలక అంశాలు ఉన్నాయని టాక్. 60శాతం మార్కులతో టెన్త్ పాసయిన హీరో బిటెక్ లో 40శాతం మార్కులు తెచ్చుకుంటాడు. 30శాతం మార్కులే వస్తాయని అందుకే ఎంటెక్ చేయలేదని తనమీద తానే జోక్ చేసుకుంటాడు.

షాపులో పనిచేస్తుంటే ఫ్రెండ్స్ పరిచయం, ఆతర్వాత ఓ అమ్మాయితో ప్రేమలో పడడం, అనుకోకుండా ఓ కేసులో ఫ్రెండ్స్ తో కల్సి హీరో జైలుకి వెళ్లడం ఇలా నడుస్తుంది. అయితే జైలు నుంచి వచ్చాక జాతిరత్నాలుగా ఎలా మారారన్నదే సినిమా ప్రధాన ఉద్దేశ్యం. హీరో ఆకట్టుకునే నటన, హీరోయిన్ ఫరీదా , వెన్నెల కిషోర్ తదితరుల కామెడీ, డైరెక్టర్ నాగ అశ్విన్ నిర్మించడం, సంగీతం, అనుదీప్ డైరెక్షన్ .. ఇలా ఈ సినిమాను హిట్ చేస్తాయని అంటున్నారు. అందుకే మార్చి 11న రిలీజయ్యే సినిమా సానుకూల ఫలితాన్ని రాబడు తుందని అందరూ ఎదురు చూస్తున్నారు.