భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన నాని…కారణం ఇదేనట
Nani remuneration : అష్టా చెమ్మా మూవీతో హీరోగా మారిన నేచురల్ స్టార్ నాని నెగెటివ్ రోల్ వేసిన ‘వి” మూవీ కరోనా సమయంలో ఓటిటి లో రిలీజై ఫ్లాప్ అయింది. అయితే తాజాగా నాని చేస్తున్న టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మళ్లీ సక్సెస్ బాట పడతాడని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. అయితే అభిమానుల అంచనాలు నిజం కావాలంటే, ఆ సినిమాలు రిలీజవ్వలి. అందుకే కొన్ని నెలలు సమయం పడుతుంది. సరిగ్గా ఈసమయంలోనే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఉన్నట్టుండి నాని రెమ్యునరేషన్ పెంచేసాడట.
అదేంటి, హిట్ కొట్టకుండా అప్పుడే ఎలా పెంచాడని కొందరి సందేహం. అయితే ఇక్కడే లాజిక్కుంది. అదేంటంటే, ప్రస్తుతం నాని నటిస్తున్న టక్ జగదీష్ సినిమా హక్కులు భారీ మొత్తానికి విక్రయించడంతో నాని రెమ్యునరేషన్14 కోట్లకు పెంచేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. నిజానికి ప్రస్తుతం ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోల్లో 40 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా నానికి పేరుంది. పైగా వరుస సినిమాల్లో నటిస్తున్న నాని నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి రానున్నాయి.
నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ లో , అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో రానున్నాయి. టక్ జగదీష్ ఫ్యామిలీ స్టోరీ కాగా, శ్యామ్ సింగరాయ్ పీరియాడిక్ స్టోరీగా వస్తోంది. నాని మూడు గెటప్స్ లో కనిపించే టక్ జగదీశ్ మూవీకి ట్యాక్సీవాలా సినిమా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే కరోనాకి ముందు 9నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్న నాని ఇప్పుడు రెమ్యునరేషన్ ను భారీగా అంటే 14 కోట్లకు పెంచేసినట్టు టాక్. ప్రొడ్యూసర్స్ కూడా అందుకు సిద్ధపడ్డారంటే మామూలు రేంజ్ కాదు నానిది.