గాలి సంపత్ మూవీ రివ్యూ…హిట్టా…ఫట్టా..?
Gaali sampath Movie review :అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణలో అనిల్ కృష్ణ దర్శకత్వం లో రాజేంద్రప్రసాద్ శ్రీ విష్ణు ప్రధాన పాత్రలు పోషించిన గాలి సంపత్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.ఇక కథ విషయానికి వస్తే…అరకులో ఉండే గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్) నటుడిగా రాణించాలని తాపత్రయపడుతూ ఉంటాడు. అతను మాట్లాడితే బయటకి గాలి తప్ప మరో శబ్దం రాదు.అతని కొడుకు (శ్రీ విష్ణు) ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు.
తన నటనతో రాణించాలని కొడుకుకు సహాయ పడాలని అనుకుంటాడు. . అయితే కొన్ని పనులతో కొడుకును దూరం చేసుకుంటాడు. ఇలాంటి సంఘటనల మధ్య తన ఇంటి ముందు ఉన్న ముప్పై అడుగుల గొయ్యిలో పడతాడు. నోటిలోంచి మాటలు రాని వ్యక్తి ఆ గోతిలోంచి ఎలా బయటికి వచ్చాడు.. కొడుకు.. తండ్రి మనస్సును అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ..?
రాజేంద్ర ప్రసాద్ నటన సినిమాకి హైలెట్. ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో గుర్తుండి పోతుంది.