కొమరం పులి హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Komaram Puli Heroine Nikesha Patel :సినిమా ఇండస్ట్రీ అనేది ఒక్కొక్కరికీ ఒక్కో అనుభవాన్ని మిగులుస్తుంది. సినిమా ఇంకా విడుదల కాకుండానే ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ఆఫర్స్ మీద ఆఫర్స్ దక్కించుకోవడం తాజాగా వింటున్నాం. అయితే ఒక్కోసారి కొంతమంది హీరోయిన్లు చాలా కష్టపడి సినిమా పరిశ్రమకు వచ్చినప్పటికీ నిలబడలేక ఇండస్ట్రీకి దూరమవుతారు. ఆ మధ్య టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , ప్రముఖ దర్శకుడు ఎస్. జె సూర్యదర్శకత్వంలో వచ్చిన కొమరం పులి మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యూటీ నిఖిషా పటేల్ ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండలేక వేరే దేశం వెళ్ళిపోయింది.
తెలుగులో చివరగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఓం 3డి చిత్రంలో రెండో హీరోయిన్ గా, అలాగే సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన … అరకు రోడ్డులో అనే మూవీస్ లో చేసింది. కానీ ఇవి ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. దీనికి తోడు ఓ తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించినప్పటికీ పలు కారణాల వల్ల ఆ చిత్రం ఇప్పటికీ విడుదల కాకపోవడంతో ఈ భామ ఇక ఇండస్ట్రీ వదిలేసి బ్రిటన్ కి వెళ్లిపోయిందని టాక్.
నిజానికి నిఖిషా పటేల్ ఇతర దేశాలలో పుట్టి పెరిగినప్పటికీ భారతదేశంలో మోడలింగ్ రంగంలో పలు కోర్సులను చేసింది. అలా కొమరం పులి చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ తెచ్చుకుని, నటనవైపు అడుగులు వేసింది. కానీ పెద్దగా కల్సి రాకపోవడంతో తప్పుకున్న ఈ అమ్మడు ఈసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడి చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల పై మాత్రం ఆమె నుంచి క్లారిటీ రాలేదు.