MoviesTollywood news in telugu

వైష్ణవ్ తేజ్ గురించి ఈ విషయాలు తెలిస్తే అసలు నమ్మలేరు

Vaishnav Tej : ఉప్పెన మూవీతో మెగా కాంపౌండ్ నుంచి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ తేజ్ కరోనా తర్వాత కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాడు. అంతేకాదు, సినిమాలకు జనం వస్తారన్న నమ్మకం కల్గించాడు. సాయిధరమ తేజ్ కంటే నాలుగేళ్లు చిన్నవాడైన వైష్ణవ్ 1990 జనవరి 13న శివప్రసాద్, విజయ దుర్గ దంపతులకు నెల్లూరులో జన్మించాడు.

మెగాస్టార్ గా చిరంజీవి మంచి పొజిషన్ లో ఉన్నా, బావ శివప్రసాద్ పెద్దగా వ్యాపకం ఉండేది కాదట. ఇక ఇంటర్ తో ఆపేసిన పవన్ కూడా అక్కతో నెల్లూరులోనే ఉండేవాడట. తనకి ఇబ్బందులున్నా సరే, తనదగ్గరున్న సొమ్ములతో సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లకు పవన్ బొమ్మలు కొనిచ్చేవాడట. అక్కకు సాయపడేవాడట. పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లి తీసుకొచ్చేవాడు.

ఇక చెన్నైలో సెటిలయిన చిరంజీవి పిలుపు మేరకు అమ్మా నాన్నలను తీసుకుని నాగబాబు, పవన్ చెన్నై వెళ్లారు. కొన్నాళ్ల తర్వాత అక్క ఫ్యామిలీ ని కూడా చిరు చెన్నై కి తీసుకొచ్చి, తన ఇంటి పక్కనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ఉంచాడు. అయినా శివప్రసాద్ లో మార్పు రాలేదు. దాంతో అక్కకి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా పవన్ చూసేవాడు.

సాయిధరమ్ తేజ్ ఒంటరిగా ముభావంగా ఉండడం తో పక్కనే నరేష్ కొడుకు నవీన్ తో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అప్పటికి వైష్ణవ్ కి మూడేళ్లు. ఇక పవన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాక అక్క ఫ్యామిలీని ఆర్ధికంగా ఆదుకునేవాడు. 1998నాటికి చిరంజీవి హైదరాబాద్ వచ్చేయడం, పవన్ , నాగబాబు కూడా వెంట రావడంతో అక్క కుటుంబాన్ని కూడాతీసుకొచ్చారు. పిల్లలిద్దరినీ స్కూల్లో చేర్పించారు.

వైష్ణవ్ అచ్చం పవన్ పోలికలు, తాతగారి పోలికలు ఉండేవని అంటారు. అందుకే చిన్నప్పటి రోల్ కి వైష్ణవ్ ని పవన్ ఎంచుకున్నాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో చలనంలేని వ్యక్తిగా హిందీలో పెద్ద వ్యక్తితో చేయిస్తే, తెలుగులో మాత్రం వైష్ణవ తేజ్ తో చేయించారు చిరంజీవి. ఈ సినిమాలో 5రోజుల వర్కింగ్ డేస్ లో వైష్ణవ్ నటన పూర్తయింది.

అలా రెండు మూవీస్ తర్వాత మళ్ళీ ఎప్పుడు నటించలేదు. ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు, తండ్రి సరిగ్గా లేకపోవడం వంటి పరిస్థితుల్లో చదువుపై దృష్టిపెట్టి బీఎస్సీ, ఎంబీఏ పూర్తిచేసిన వైష్ణవ్ ఏరోనాటికల్ లో సైన్టిస్ట్ అవ్వాలనుకున్నాడు. డిజైనర్ అవ్వాలని అనుకున్నాడు. ఈలోగా రేయ్ సినిమా ఆగిపోవడం, పిల్లా నువ్వులేని జీవితం కూడా ఆగిపోవడం, సాయిధరమ తేజ్ ఐరెన్ లెగ్ గా పేర్కొనడంతో మళ్ళీ ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి. సినిమాల్లోకి రాకూడదని భావించి, ఆర్మీలోకి వెళ్లాలని సంతకం కూడా చేసినా అదీ కుదరలేదు.

ఈలోగా పవన్ సూచన మేరకు థాయిలాండ్ వెళ్లి 2017లో బాక్సింగ్ నేర్చుకున్నాడు. అక్కడే ఉండిపోదామనుకుని ఎందుకో హైదరాబాద్ వస్తే, కొత్త హీరో కోసం వెతుకుతున్న బుచ్చిబాబు సానా కు దొరికిపోయాడు. మెగాస్టార్ కూడా ఒకే చెప్పేయడం, పవన్ సలహా మేరకు వైజాగ్ లో సత్యానంద్ దగ్గర రెండు నెలలు శిక్షణకు వెళ్లడం, 2019మేలో షూటింగ్ స్టార్ట్.

షూటింగ్ పూర్తయ్యాక 2020మార్చి 2న నీలి కళ్ళు సాంగ్ రిలీజ్. పాట హిట్. శ్రీరామ నవమికి రిలీజ్ అనుకుంటే కరోనా దెబ్బకు ఇండస్ట్రీ మూతపడింది. ఎలాగైనా థియేటర్లోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టి మొన్న ఫిబ్రవరి 12న రిలీజయిన ఉప్పెన కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ బ్లాక్ బస్టర్ అయింది.