హీరో శ్రీ విష్ణు భార్య ఏమి చేస్తుందో తెలుసా?
Tollywood hero sree vishnu wife : టాలీవుడ్ డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా ఉన్న సంగతి తెల్సిందే. అలాగే శ్రీ విష్ణు అనే హీరో కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. అవును, నారా రోహిత్ హీరోగా నటించిన బాణం మూవీలో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి సినిమా పరిశ్రమలో శ్రీవిష్ణు ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన అప్పట్లో ఒకడుండేవాడు అనే మూవీలో సెకండ్ హీరోగా నటించాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రానా తదితర స్టార్ హీరోల చిత్రాల్లో కూడా కనిపించాడు.నటన పరంగా ఎంతో ప్రతిభ గల శ్రీ విష్ణు కి తగిన ఛాన్స్ లు రాలేదు.
అయితే తిప్పరా మీసం అనే చిత్రంలో హీరోగా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తన తదుపరి చిత్ర కథల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. కాగా ప్రస్తుతం గాలి సంపత్ అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమా నిన్న విడుదల అయ్యి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న రాజ రాజ చోర అనే తెలుగు మూవీలో నటించడానికి ఒకే చెప్పాడట. తనకి సినిమా పరిశ్రమలో ఉన్న ఏకైక స్నేహితుడు నారా రోహిత్, అంతేగాక అతడు షూటింగుల నిమిత్తం , పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్ళినప్పుడు తన కోసం కూడా షాపింగ్ చేస్తుంటాడని ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు.
కాగా 2013లో ప్రశాంతి ముళ్లపూడిని శ్రీ విష్ణు పెళ్లి చేసుకున్నాడు. ప్రశాంతి తల్లిదండ్రులు వివిధ వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. శ్రీ విష్ణు దంపతులకు మ్రిధ అనే ఒక పాప ఉంది. చిన్నప్పటి నుంచి శ్రీ విష్ణు కి స్పోర్ట్స్ పట్ల మక్కువ ఉండడం వలన ఆంధ్రప్రదేశ్ తరఫున అండర్ 19 క్రికెట్ జట్టులో ఆడాడు. అలాగే సినిమాల పట్ల ఆసక్తి కారణంగా సినిమా ఛాన్స్ ల కోసం హైదరాబాద్ కి వచ్చాడు. నిజానికి అప్పట్లో శ్రీ విష్ణు – ప్రశాంతిల పెళ్లి కి హీరో నారా రోహిత్ సహాయం చేశాడట. అందువల్లే శ్రీ విష్ణు కి నారా రోహిత్ మంచి స్నేహితుడని అంతేగాక శ్రీ విష్ణు హీరోగా నటించిన పలు చిత్రాలకు నారా రోహిత్ ఫైనాన్షియర్ గా వ్యవహరించాడని టాక్ నడుస్తోంది.