వైష్ణవ్ తేజ్ కి మెగాస్టార్ ఎంత విలువైన గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?
Chiranjeevi And Vaishnav Tej :స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఎంతోమందికి స్ఫూర్తి. ముఖ్యంగా అయన ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు వచ్చి సక్సెస్ కొడుతున్నారంటే అందుకు చిరంజీవి వేసిన ఫ్లాట్ ఫామ్ కారణం. తాజాగా ఉప్పెన మూవీతో మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి కరోనా తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తొలిమూవీతోనే యంగ్ స్టార్ హీరో గా మారిపోయాడు. నెల రోజులు కావస్తున్నా ఇంకా మంచి షేర్ తెస్తోంది.
వంద కోట్ల మార్క్ ఇటీవలే క్రాస్ చేసిన ఉప్పెన సినిమా కోసం శాటిలైట్, ఓటీటీ ప్లాట్ ఫామ్ లు వెయిట్ చేస్తున్నాయి. అక్కడ కూడా ఈ సినిమా ఖచ్చితంగా మరో కొత్త రికార్డులను నమోదు చేస్తుందని అంచనా. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు వైష్ణవ్ చేతిలో ఉండగా, రెండవ సినిమా ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో పూర్తయ్యింది. రిలీజ్ కి సిద్దంగా ఉంది. వైష్ణవ్ అన్నయ్య సాయిధరమ తేజ్ కన్నా బాగా ఎస్టాబ్లిష్ అయిన ఈ మెగా మేనల్లుడికి అభినందనలు తెలపడానికి మామ చిరంజీవి స్వయంగా తన ఇంటికి రప్పించుకుని మరీ విషెస్ చెప్పారు.
చిరంజీవిని కలిసేందుకు వెళ్లిన వైష్ణవ్ తేజ్ కు ప్రత్యేక బహుమానం అందింది. అది కూడా ఖరీదైన రిస్ట్ వాచ్ కావడం విశేషం. సినిమాలకు ఎంత పారితోషికం దక్కినా.. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయినా కూడా వైష్ణవ్ కు చిరంజీవి బహుమానం ఇవ్వడం నిజంగా గ్రేట్. అందుకే ఈ ఫొటోను వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. రాత్రికి రాత్రి స్టార్ హీరోగా ఎదిగిన వైష్ణవ్ కి భారీగా ఫాన్స్ కూడా తయారవుతున్నారు.