MoviesTollywood news in telugu

చంద్రబోస్ భార్య ఎవరు…ఆమె ఏమి చేస్తుందో తెలుసా?

Chandrabose Wife :ఒకరు గేయరచయిత చంద్రబోస్, మరొకరు కొరియోగ్రాఫర్ సుచరిత. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లిపీటలు ఎక్కింది. సాధారణంగా సినిమా హీరో హీరోయిన్స్ మధ్య పరిచయాలు ప్రేమగా, పెళ్లిగా మారుతుంటాయి. కానీ చంద్రబోస్, సుచరిత మధ్య ప్రేమ ఎలా చిగురించి పెళ్ళికి దారితీసిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. వరంగల్ లో జన్మించిన చంద్రబోస్ అసలు పేరు కూకట్ల సుభాష్. చదువు ముగించుకుని మొదట దూరదర్శన్ లో సింగర్ గా ట్రై చేసారు.

అది కుదరకపోవడంతో చంద్రబోస్ పాటలు రాస్తూ ఛాన్స్ ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. దర్శకుడు ముప్పలనేని శివతో పరిచయం కారణంగా ఆసమయంలో డాక్టర్ రామానాయుడు తీస్తున్న తాజ్ మహల్ మూవీకి డైరెక్ట్ చేస్తుండగా వెళ్లి కలుసుకుని మాట్లాడడంతో ‘మంచు కొండల్లోన చంద్రమా …’ సాంగ్ రాసే ఛాన్స్ లభించింది. శ్రీకాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ హిట్ కావడంతో పాటు చంద్రబోస్ సాంగ్ కి మంచి పేరు వచ్చింది. దీంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

పెళ్ళిసందడి వంటి సినిమాలకు సాంగ్స్ రాస్తూ గేయరచయితగా చంద్రబోస్ మంచి గుర్తింపు పొందాడు. ఆది సినిమాలో ‘నీ నవ్వుల చల్లదనాన్ని ‘ సాంగ్ కి మంచి పేరు రావడమేకాక నంది అవార్డు వచ్చింది. ఇక ఆఖరిపోరాటం వంటి సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేసిన సుచరిత మంచి పేరు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా పల్లకిలో పెళ్లికూతురు మూవీకి రాఘవేంద్రరావు పర్యవేక్షణలో సుచరిత కొరియోగ్రఫీ దర్శకత్వం వహించారు. ఇలా ఇద్దరూ ప్రేమించి పెళ్ళిచేసుకుని తమ రంగాల్లో రాణిస్తూ, ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.