అక్క,తమ్ముడు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు
Mosagallu Movie : పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని నానుడి. ఒకప్పటి కంటే ఇప్పటి తరంలో పెళ్లయ్యాక ఏమాత్రం తేడా కొట్టినా వెంటనే డైవర్స్ కి వెళ్లిపోతున్నారు. మరో పెళ్ళికి సిద్ధం అయిపోతున్నారు. సెలబ్రిటీస్ ఇళ్లల్లో ఇది సహజంగా మారింది. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ పెళ్లి అవ్వడం, అది విడాకులకు దారితీయడం కూడా అయిపొయింది. అయితే పెద్ద కొడుకు మంచు విష్ణు చేసుకున్న పెళ్లి పదిలంగా ఉంది. అయితే మోహన్ బాబు తనయులిద్దరికీ ఈమధ్య సినిమాల్లో సరైన హిట్స్ రాలేదు. దాంతో తాజాగా మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమా మార్చి 19న వస్తోంది.
ఇక ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తన అక్క మంచు లక్ష్మి తమ్ముడు మనోజ్ గురించి విష్ణు ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ లో సంచలన కామెంట్స్ చేసాడు. అక్క లక్ష్మి తమ్ముడు మనోజ్ లు ఇద్దరు కూడా చాలా చిల్ పర్సన్స్. లేట్ నైట్ పార్టీలను ఎంజాయ్ చేస్తూ, పార్టీలంటే ఇష్టపడతారు. వారి ప్రపంచం వేరు. నేను రాత్రి త్వరగా పడుకుని తెల్లవారు జామున లేస్తాను. బుక్స్ చదువుతాను. పిల్లలతో ఆడుకోవడం ఇష్టం. కానీ నాకు సాంప్రదాయాలంటే గౌరవం. నా పద్ద తులు నాకున్నాయి’ అని చెప్పుకొచ్చాడు. మనోజ్ విడాకుల గురించి ప్రస్తావిస్తూ, వాడి పర్సనల్ లైఫ్ అలా అవుతుందని అనుకోలేదన్నాడు.
అయినా జీవితంలో అన్ని అనుకున్నట్లుగా జరుగవని, అంతా బాగా అవుతాయని భావించినా, కొన్ని సార్లు వేరేలా జరుగుతుంటాయని అందుకే వాటిని మర్చి పోయి ముందుకు వెళ్లి పోవడం తప్ప ఏం చేయలేం అని వేదాంత ధోరణిలో విష్ణు చెప్పాడు. కాగా దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన మోసగాళ్లు మూవీ గురించి మీడియాలో భారీ ప్రమోషన్ ఇస్తున్నాడు. ప్రపంచంలోనే అతి పెద్ద స్కాం బ్యాక్ డ్రాప్ తో రూపొందించిన ఈ మొత్తం కథ మొత్తం కూడా కాజల్ చుట్టూనే తిరుగుతుందట. ఇందులో విష్ణు హీరోగా కాకుండా కాజల్ కు తమ్ముడి పాత్రలో కనిపిస్తాడట