2017లో మరణించిన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంత మంది ఉన్నారో…!?
2017 Tollywood Actors Died :పుట్టినవాడు మరణించక తప్పదు. మరణం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే 2017లో కొందరు సెలబ్రిటీలు మరణించి ఫాన్స్ కి శోకం మిగిల్చారు. గుళేభావళి కథ సినిమాతో టాలీవుడ్ లో గేయ రచయితగా ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ సి నారాయణ రెడ్డి దాదాపు 3వేలకుపైగా పాటలు రాసారు. సాహిత్య రంగంలో ఈయన జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు. 85వ యేట 2017లో కన్నుమూశారు. టాలీవుడ్ దర్శకరత్న ఇండస్ట్రీలో అన్ని శాఖలలో అనుభవం గల దాసరి నారాయణరావు మే 30న కన్నుమూశారు. నటుడిగా కూడా ఈయన పేరుతెచ్చుకున్నారు.
ముఠా మేస్త్రి , రామ్మా చిలకమ్మా, సర్దార్ , సామ్రాట్ వంటి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ కేసి శేఖర్ బాబు ఈ ఏడాది కన్నుమూశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బడా నిర్మాతగా రాణిస్తున్న దిల్ రాజుకి సతీ వియోగం ఈ ఏడాదే కల్గింది. ఎన్నో సినిమాలకు సమర్పకురాలిగా అనిత పేరు తెచ్చుకున్నారు. హీరో రవితేజ బ్రదర్ భరత్ కూడా ఇదే ఏడాది కారు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఎన్టీఆర్, అక్కినేని, శివాజీ గణేశన్ వంటి వారితో నటించిన సీనియర్ యాక్టర్ బివి రాధా కూడా సెప్టెంబర్ 10న గుండెపోటుతో మరణించారు.
అంకురం సినిమా ద్వారా టాలీవుడ్ లో మంచి పేరుతెచ్చుకున్న బాలీవుడ్ హీరో ఓంపురి కూడా 2017లో కన్నుమూశారు. ప్రతిఘటన వంటి ఎన్నో హిట్ మూవీస్ కి రైటర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఎంవిఎస్ హరనాధరావు కూడా ఈ ఏడాదే హృద్రోగంతో అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. అదే రోజు టివి యాంకర్ , నటి మల్లికా కూడా మరణించింది. ఇదే ఏడాది డిసెంబర్ 17న సూసైడ్ చేసుకుని కమెడియన్ విజయ సాయి సూసైడ్ చేసుకుని దిగ్బ్రాంతికి గురిచేశాడు. అలాగే ప్రదీప్ కుమార్ కూడా ఆర్ధిక ఇబ్బందులతో కన్నుమూశారు.