మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటారో తెలుసా ?
Telugu music directors remuneration :ఒక సినిమా హిట్ కావాలంటే, ముందు మ్యూజికల్ గా హిట్టవ్వాలి. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటారో , సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్స్ ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటారో వింటుంటాం. కానీ మంచి పాటలు అందించి సినిమా హిట్ కావడానికి దోహదం చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ కి కూడా అంతే విలువ ఇవ్వాలని అనుకుంటారు. అయితే వీళ్ళు కూడా భారీగానే తీసుకుంటునట్టు వార్తలొస్తున్నాయి. భక్తి రస చిత్రాలే కాదు, బాహుబలి వంటి మూవీస్ కి మ్యూజిక్ అందించిన ఎం ఎం కీరవాణి కోటిన్నర వరకూ ఛార్జి చేస్తున్నాడు.
మెలోడీ బ్రహ్మగా పేరొందిన మణిశర్మ ఒక్కో సినిమాకు కోటి ఛార్జి చేస్తున్నాడు. దేవి మూవీతో ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు మంచి ఫాలోయింగ్ లో ఉన్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా మ్యూజిక్ అందించాడు. దాదాపు 120మూవీస్ చేసాడు. ఒక్కో సినిమాకు కోటిన్నర నుంచి రెండుకోట్లు ఛార్జి చేస్తున్నాడు. అలవైకుంఠపురంలో వంటి హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమన్ 2కోట్ల వరకూ ఛార్జి చేస్తున్నాడు. టెంపర్ వంటి మూవీస్ కి సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ ఒక్కో సినిమాకు కోటి తీసుకుంటున్నాడు.
టెన్త్ క్లాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చి 30సినిమాలకు పైనే చేసిన మిక్కీజే మేయర్ 60లక్షల వరకూ తీసుకుంటున్నాడు. ఊపిరి, గీత గోవిందం వంటి సినిమాలకు సంగీతం అందించిన గోపీ సుందర్ వరుస సినిమాలు చేస్తూ ఒక్కో మూవీకి కోటి వరకూ అందు కుంటున్నాడు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఒక్కో మూవీకి కోటిన్నర వరకూ పుచ్చుకునుటున్నాడు. సాహో వంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శిబిరాన్ ఒక్కో సినిమాకి 80లక్షల దాకా ఛార్జి చేస్తున్నాడు.