MoviesTollywood news in telugu

2020 లో తల్లి తండ్రులు అయిన 8 మంది సెలబ్రిటీస్ వీరే

Tollywood Star Kids :మాతృత్వం అనేది గొప్ప అంశం. పెళ్లయ్యాక అమ్మా నాన్నా అనిపించుకోవాలని చాలామంది ఆశపడతారు. పుట్టిన పిల్లల్ని చూసుకుని మురిసిపోతుంటారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా పేరెంట్స్ గా మారితే చాలా ఆనంద పడతారు. ఇక సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటారు. 2020లో ఇలా చాలామంది పేరెంట్స్ అయ్యారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

ఒకప్పటి హీరోయిన్ స్నేహ 2020లో పండంటి పాపకు జన్మనిచ్చింది. స్నేహ దంపతులకు గతంలో ఒక బాబు పుట్టాడు. అలాగే సింధూరం వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఒకనాటి హీరోయిన్ సంఘవి కూడా 2020లో ఓ పాపకు జన్మనిచ్చింది. 42ఏళ్ళ వయస్సులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లిచేసుకోవడం ఈమె లోని స్పెషాల్టీ. నువ్వు నేను హీరోయిన్ అనిత 2013లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ బాబుకి జన్మనిచ్చింది.

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి టాలీవుడ్ లో సాహస వీరుడు సాగర కన్య లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజ్ కుందన్ ని పెళ్లాడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమృతరాయ్ గత జనవరిలో బాబుకి జన్మనిచ్చింది. తమిళ హీరో కార్తీ 2020అక్టోబర్ లో రెండోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య రంజని పండంటి బాబుకి జన్మనిచ్చింది.