లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మన హీరోయిన్స్ పారితోషికం ఎంతో తెలుసా?
Tollywood heroines :అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకూ అన్ని భాషలలో కూడా దాదాపు హీరోలదే పైచేయి గా ఉంటుంది. హీరోయిన్ కేవలం గ్లామర్ కే పరిమితం అవుతూ ఉంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్స్ తగిన పాత్రతో పాటు ప్రాధ్యాన్యం,రెమ్యునరేషన్ కూడా ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు స్టార్ హీరోయిన్స్ మొగ్గుతున్నారు.
దీనివలన కోట్లకు కోట్లు అందుతున్నాయి. బాలీవుడ్ లో కంగనా రౌనత్ వంటి స్టార్ హీరోయిన్స్ తో ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు వందల కోట్ల వసూళ్లు తెస్తున్నారు. సౌత్ లో కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు మంచి ఫాలోయింగ్ ఉంది.
ముఖ్యంగా వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న నయనతార కూడా మూడు నుండి నాలుగు కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటోంది. ఇక మహానటితో ఎనలేని కీర్తి తెచ్చుకున్న కీర్తి సురేష్ వరుసగా మూడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి, భారీ ఎత్తున రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్. ఎందుకంటే ఇలాంటి స్టార్ హీరోయిన్స్ చేస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రాల బిజినెస్ కూడా భారీగా ఉంటోంది.
కాగా అక్కినేని వారి కోడలు సమంత మెయిన్ లీడ్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తీస్తున్న శాకుంతలం సినిమాకు 3 కోట్లకు పైగా పారితోషికంగా అందుకుంటున్నట్లు టాక్. శాకుంతలం కోసం సమంతను కేవలం 5నుండి 6 నెలల డేట్లను మాత్రమే గుణశేఖర్ అడిగి, ఆరు నెలల లోపే షూటింగ్ ముగించబోతున్నాడు. లేడీ ఓరియంటెడ్ మూవీ తక్కువ సమయంలో పూర్తి చేస్తూ, భారీ పారితోషికం ఇవ్వడం మాములు విషయం కాదు. ఇక శాకుంతలం సక్సెస్ కొడితే, సమంత 5 కోట్లకు రెమ్యునరేషన్ పెంచేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.