NTR గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పరుచూరి
NTR And Paruchuri Gopala Krishna :టాలీవుడ్ లో ఈమధ్య వరుస హిట్స్ తో హ్యాట్రిక్ అందుకుంటూ దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కల్సి అరవింద సమేత సినిమా చేసి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కల్సి మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఏకంగా మూడేళ్లు కేటాయించాడు. రామోజీరావు తీసిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. వరుస విజయాలతో స్టార్ హోదా అందుకున్నాడు.
అచ్చం పెద్ద ఎన్టీఆర్ పోలికలు గల తారక్ గురించి ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిజానికి ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు మిగిలిన హీరోల మాదిరిగా ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోకు యాంకర్ గా చేయడానికి రెడీ అయ్యాడు. దీనిపై పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ గుర్తింపు ఉన్న హీరోలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే అవసరమా అని అనిపిస్తుందని కామెంట్స్ చేసారు. తారక్ అని పిలిస్తే మాత్రం చిన్నరామయ్య అని పిలవమని ఎన్టీఆర్ చెబుతాడని గోపాలకృష్ణ వెల్లడించారు.
అయితే హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ మంచి పేరు తెచ్చిపెట్టిందని సీనియర్ ఎన్టీఆర్ లా చిన్న రామయ్య(జూనియర్ ఎన్టీఆర్)కు సమయస్పూర్తితో పాటు జ్ఞాపకశక్తి ఎక్కువని గోపాలకృష్ణ అన్నారు. ఫేస్ లో ప్రశ్నకు సమాధానం రైటా ? రాంగా ? అని తెలీకుండా చేసే ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం కోసం తాను ఎంతో ఎదురు చూస్తున్నానని చెప్పారు. చిన్న రామయ్య ఈ కార్యక్రమం ద్వారా తెలుగువారి ఔన్నత్యాన్ని చాటి చెబుతాడని భావిస్తున్నామన్నారు.