MoviesTollywood news in telugu

రౌడి స్టార్ కొత్త బిజినెస్…దూకుడు మామూలుగా లేదుగా

vijay devarakonda new business :టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో పైకి వచ్చిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ను రౌడీ స్టార్ అనిపిలుస్తారు. ఇతడి తమ్ముడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమాలతో పాటు యాడ్స్ లో కూడా విజయ్ దూసుకుపోతున్నాడు. మరోవైపు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడికి అనుగుణంగా రౌడీ బ్రాండ్ దుస్తులతో వ్యాపారాన్ని స్టార్ట్ చేసాడు. వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది.

తాజాగా మరో వ్యాపారం వైపు విజయ్ దృష్టి పెట్టాడని టాక్. అదేంటంటే తెలంగాణలోని మహబూబ్ నగర్ లో మల్టీ ప్లెక్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు వైరల్ అవుతోంది. ఎందుకంటే సొంత జిల్లా కావడం అందునా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని మామూలు థియేటర్ కన్నా మల్టీ ప్లెక్స్ లవైపే జనం మొగ్గుతారని భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లి చూపులు సినిమా సూపర్ హిట్ తో అందరి దృష్టిలో పడిన విజయ్ .. ఆతర్వాత సందీప్ వంగా తీసిన అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని రాత్రికి రాత్రి స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక గీత గోవిందం మూవీతో మరింత రేంజ్ పెంచేసుకున్నాడు. ఈమధ్య కొన్ని సినిమాలు దెబ్బతిన్నా రేంజ్ మాత్రం తగ్గలేదు.