MoviesTollywood news in telugu

లీడర్ సినిమాలో రానా ఎంపిక వెనక రహస్యం ఇదే

Leader Movie Online :కొన్ని సినిమాలు కొందరి కోసమే తయారవుతాయి. వాళ్ళే ఆ పాత్రల్లో జీవించగలరు. ఎక్కడున్నా అలాంటి పాత్రలు వెతుక్కుంటూ మరీ వస్తాయి. ఇందుకు ఎన్నో సినిమాలు ఉదాహరణగా చెప్పొచ్చు. అంతెందుకు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లీడర్ మూవీతో మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు మనవడు దగ్గుబాటి రానా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి ఈ మూవీ రిస్క్ కథతో కూడుకున్నదైనా రానా చేసి, శెహభాష్ అనిపించాడు. కథ, పాత్ర బాగుంటే నెగెటివ్ రోల్ అయినా సరే అంటూ బాహుబలి లో నెగెటివ్ రోల్ తో రానా మెప్పించాడు.

ప్రస్తుతం రానా అడవి బ్యాక్ డ్రాప్ తీసిన అరణ్య అనే మూవీతో మార్చి 26న థియేటర్లలోకి రాబోతున్నాడు. అలాగే విరాటపర్వం సినిమాలో చేస్తున్నాడు. కాగా అరణ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి లీడర్ సినిమా డైరెక్టర్ శేఖర్ కమ్ముల గెస్ట్ గా విచ్చేసి, మాట్లాడుతూ కీలక విషయం వెల్లడించాడు. రానా ముఖం చూసి ఈ సినిమాకు అతనిని హీరోగా ఎంపిక చేశానని అరణ్య డైరెక్టర్ ప్రభు చెప్పారని అయితే తాను మాత్రం రానా గొంతు విని లీడర్ సినిమాకు తీసుకున్నానని చెప్పాడు.

లీడర్ సినిమా విడుదలై సరిగ్గా పదేళ్లు అవుతోందని శేఖర్ కమ్ముల గుర్తుచేశాడు. ఆ మూవీలో సీఎం పాత్రలో నటించి రానా నటుడిగా మెప్పించాడు. లీడర్ సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకున్నా రానా కెరీర్ కు మాత్రం ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక రానా ఎప్పుడూ వేర్వేరు గెటప్స్ లో కనిపిస్తూ విభిన్నమైన కథలను ఎంచుకుంటారని శేఖర్ కమ్ముల చెబుతూ , పిల్లలకు, ఫ్యామీలీలకు అరణ్య సినిమా ఎంతగానో నచ్చుతుందన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించినట్టు అర్థమవుతోందని పేర్కొన్నాడు.