కళ్ళు చిదంబరం గురించి నమ్మలేని నిజాలు…పిల్లలు ఏమి చేస్తున్నారో…!?
Comedian Kallu Chidambaram :నటించిన సినిమాతోనే గుర్తింపు పొంది అదే సినిమా ఇంటిపేరుగా గల నటులు చాలామంది ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో సాక్షి సినిమాతో సాక్షి రంగారావు, శుభలేఖ సినిమాతో శుభలేఖ సుధాకర్, ఆహుతి మూవీతో ఆహుతి ప్రసాద్ ఇలా చాలామంది కనిపిస్తారు. అలాగే కమెడియన్ కళ్ళు చిదంబరం కూడా. ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్స్ ఉన్నా హావభావాలతో, రూపురేఖలతో గుర్తుండి పోయిన కమెడియన్స్ లో కళ్ళు చిదంబరం ఒకరు. తొలిసినిమాతోనే అవార్డు కొట్టేసారు. కెమెరామెన్ రఘు దర్శకత్వం వహించిన కళ్ళు మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడమే కాదు, ఆ సినిమాలోని నటనకి నంది అవార్డు దక్కించుకున్నారు. నిజానికి ఆ ఒక్క సినిమాతో కళ్ళు చిదంబరం కొన్ని రోజులపాటు స్టార్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు.
చాలా సినిమాల్లో నటించిన కళ్ళు చిదంబరం ముఖ్యంగా కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన అమ్మోరు మూవీలో కళ్ళు చిదంబరం మంచి నటన కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. అలాగే పెళ్లి చేసుకుందాం సినిమా లో కూడా కళ్ళు చిదంబరం ఒక మంచి క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసినిమాకు ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ చేసారు. అలాగే ఎస్.వి కృష్ణారెడ్డి, ఇ.వి.వి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, వంటి దర్శకుల సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఇక తను నటుడిగా నటిస్తూ సినిమాలో నాటకాల్లో వచ్చే డబ్బులతో పేద కళాకారులకు సహాయం చేసేవాడు. తను మాత్రం తను చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన డబ్బు మాత్రమే తన జీవనానికి వాడుకొనేవాడు. ఇండస్ట్రీకి చెందిన చాలామంది చాలాసార్లు సన్మానించారు.
కళ్ళు చిదంబరం నటనను బ్రహ్మానందం లాంటి వాళ్ళు ప్రశంసించారు. మొదటి నుంచి కళ్ళు చిదంబరం కి నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో తను పొద్దంతా జాబ్ చేస్తూ రాత్రి వేళల్లో నాటకాల్లో వివిధ పాత్రల్లో నటించేవారు. చాలా రోజుల పాటు అలాగే చేయడంతో తన కళ్ళు అలా అయిపోయాయని ఆయన తరచూ చెప్పేవారు అయితే కళ్ళు పోవడం దురదృష్టమైనా, నిజానికి ఆయన కళ్ళు అలా ఉండడం వల్లే సినిమాల్లో కమెడియన్ గా ఛాన్స్ లు వెతుక్కుంటూ వచ్చేలా చేసి, అదృష్టవంతుడిగా మార్చాయి. కళ్ళు చిదంబరం 2015లో అనారోగ్యం కారణం వల్ల కన్నుమూశారు. ఆయనకి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. కానీ ఎవరూ ఇండస్ట్రీకి రాలేదు.