అప్పుడే RRR ఆ రేంజ్ వసూళ్లు తెచ్చేసింది…ఎన్ని కోట్లో తెలుసా?
RRR Movie : బాహుబలి బిగినింగ్, ఎండింగ్ మూవీస్ తీసి వరల్డ్ లెవెల్లో తెలుగు సినిమా స్టామినా చాటిచెప్పిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. పైగా ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్, మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కల్సి నటిస్తున్న నేపథ్యంలో ఇరువురి ఫాన్స్ లోనే కాదు ఆడియన్స్ లో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. బాహుబలి 2 ను బీట్ చేసే సత్తా ఉందని కూడా బలంగా చెప్పేస్తున్నారు.
బాహుబలి – 2 మొత్తం మీద 2500 కోట్లను కలెక్ట్ చేయగా, దాన్ని దాటిపోయి ఆర్ ఆర్ ఆర్ మూవీ 3 వేల కోట్ల వరకు తీసుకు వస్తుందని ట్రేడ్ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో సినిమా లోని నటీ నటులు సాంకేతిక నిపుణులు సినిమా అంచనాలు పెంచే విధంగా మాట్లాడుతున్నారు. అంతెందుకు ఒక్క శాటిలైట్ రైట్స్ ద్వారానే వంద కోట్లకు పైగా ఆర్ ఆర్ ఆర్ రాబట్టే ఛాన్స్ ఉందని టాక్.
ఇక ఇండియన్ సినీ మార్కెట్ లోనే కాకుండా ఈ సినిమా అన్ని భాషల్లో అన్ని దేశాల్లో కూడా ఆర్ ఆర్ ఆర్ దుమ్మురేపుతుందన్న అంచనాతో ఉన్నారు.అందుకే ఈ సినిమాకు భారీ ఎత్తున బిజినెస్ అవుతోంది. థియేట్రికల్ రైట్స్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయల దాకా రావచ్చని చెబుతున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి 400 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ వచ్చే నెలతో పూర్తి కాబోతుంది. విడుదలకు అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.