జాతర సినిమాకి చిరంజీవి పారితోషికం ఎంతో తెలుసా?
Jathara Telugu Full Movie :మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ప్రాణం ఖరీదు,పునాదిరాళ్ళు,మనవూరి పాండవులు వంటి సినిమాలతో అప్పుడే ఎదుగుతున్న రోజుల్లో జాతర అనే సినిమాను 1979ప్రాంతంలో తీశారు. ధవళ సత్యం దీనికి డైరెక్టర్. ఈయనకు ఇది మొదటి సినిమా. నిజానికి నరసింహరాజు అప్పటికి చాలా సినిమాలతో ఆకట్టుకుంటుంటే, అతడితోనే తీయొచ్చు కదా అని కొందరు సలహా ఇచ్చినా సరే చిరుతో జాతర తీశామని నిర్మాత రాజు చెప్పారు.
ఇప్పటికీ చిరంజీవి మెగాస్టార్ గా ఉన్నత స్థానంలో ఉన్నా సరే, ఆప్యాయంగా పలకరిస్తుంటారని ఇది తమ భాగ్యంగా భావిస్తామని రాజు చెప్పారు. నేను పుట్టిన ఊళ్ళోనే తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో 45రోజులు షూటింగ్ చేశామని ఓ ఇంటర్యూలో నిర్మాత రాజు తెలిపారు. హీరో బ్రదర్ గా శ్రీధర్, విలన్ గా నాగభూషణం చేసారు. అందరూ కూడా సఖినేటిపల్లి వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారు.
సినిమా ఆర్ధికంగా లాభం తీసుకు రాకపోయినా మంచి పేరు తెచ్చింది. అందరూ జాతర రాజు గారు అని నిర్మాతను పిలిచేవారట. నరసాపురం వరకూ రైలులో వచ్చి అక్కడనుంచి పడవల మీద సఖినేటిపల్లి చేరుకొని, బంధువుల ఇళ్లల్లోనే అందరినీ ఉంచి షూటింగ్ చేసారు. ఆ సినిమాకు చిరుకి 10వేల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రివ్యూ చూసిన మాదాల రంగారావు నవతరం కదిలింది మూవీకి డైరెక్టర్ గా ధవళ సత్యం ను కన్ఫర్మ్ చేసుకున్నారు.