MoviesTollywood news in telugu

రాహుల్ రామకృష్ణ గ‌డ్డం,జుట్టు పెంచడానికి అసలు కారణం ఇదే

Rahul Ramakrishna Movies :తాజాగా రిలీజైన జాతిరత్నాలు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో కన్పించిన రాహుల్ రామకృష్ణ మంచి నటనతో పలు సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఈ మూవీలో కూడా హీరో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శిలతో కల్సి నవ్వులు పూయించాడు. గడ్డం, జుట్టు బాగా పెంచడం ఇతడికి ప్లస్ పాయింట్.

అర్జున్ రెడ్డి ద్వారా టాలీవుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ ఆతర్వాత విజయ దేవరకొండతో కల్సి గీతాగోవిందం మూవీలో చేసాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కల్సి భరత్ అనే నేను మూవీలో చేసాడు. ఇవన్నీ బ్లాక్ బస్టర్ మూవీస్ విశేషం. ఇక రాహుల్ రెండేళ్లుగా గడ్డం,మీసం పెంచడం వెనుక ఓ రహస్యం ఉందని వైరల్ అవుతోంది.

ఇంతకీ అదేమిటంటే, ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో కీలక పాత్రలో రాహుల్ నటిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కి అనుచరునిగా ఈ మూవీలో ఎక్కువ సేపు కనిపిస్తాడట. అందుకే గెడ్డం, జుట్టు పెంచాడు. అగ్రిమెంట్ ప్రకారం లాక్ డౌన్ లో సైతం గెడ్డం, జుట్టు తీయకపోవడం విశేషం. ఏప్రియల్ లో పూర్తికానున్న ఈ షూటింగ్ కోసం రాహుల్ ఇలాగే ఉండబోతున్నాడు. అంతేకాదు, ఈ సినిమా కోసం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ లుక్స్ ని మార్చుకోలేదు.