MoviesTollywood news in telugu

ఒకప్పటి ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu actress ruthika :ఇమేజ్ ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. అదే ఇమేజ్ తగ్గాక చేస్తే శాపంగా మారుతుంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల విషయంలో ఇది అక్షరాలా నిజం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఛాన్స్ లు తగ్గినపుడు ఏ పాత్ర వస్తే అది చేసేస్తారు. దశ బాగుంటే పర్వాలేదు. లేకుంటే రివర్స్ అవుతుంది. సరిగ్గా హీరోయిన్ రుతిక విషయంలో తేడా కొట్టేసింది. ఈమెకు తగిన ఛాన్స్ లు రాకపోవడంతో ఏకంగా స్పెషల్ సాంగ్స్ లో నటించి, దారుణంగా దెబ్బతింది.

ప్రముఖ సీనియర్ దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ‘ సిక్స్ టీన్స్’ మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రుతిక ఆతర్వాత కొన్ని సినిమాల్లో చేసింది. హీరోయిన్ రుతిక సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఏడాదికి 3,4చొప్పున సినిమాలు చేస్తూ నాలుగేళ్లలోనే హీరోయిన్ గా తనకంటూ ఇమేజ్ తెచ్చుకుంది. అయితే ఈమె నటించిన పాత్రలు, చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఛాన్స్ లు తగ్గిపోయాయి.

ఆ మధ్య తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నా సరే, దశ తిరగలేదు. ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు లేక రుతిక పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించడానికి సిద్ధమైంది. అయినా సరే, ఈమెకు పెద్దగా కలిసి రాకపోవడంతో ప్రస్తుతం రుతిక సినిమా ఛాన్స్ లు తగ్గిపోయి కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో ఇంటికి పరిమితమైంది. నిజానికి ఈమె .. సారీ మా ఆయన ఇంట్లో నే ఉన్నాడు, సారీ నాకు పెళ్లైంది, సరదా సరదాగా, పెళ్ళికి నేను రెడీ, బ్లేడ్ బాబ్జి ,ఎక్స్ ట్రా వంటి మూవీస్ తో బాగానే ఆడియన్స్ ని ఆకట్టుకుంది.