నయనతార ఇమేజ్ వెనుక అసలు కారణం ఇదే…నమ్మలేని నిజం
Telugu actress Nayanthara :గ్లామరస్ పాత్రలతోనే కాకుండా లేడి ఓరియెంటెండ్ పాత్రలతో కూడా రాణిస్తున్న నయనతార 2003లో మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2006లో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు, మలయాళం , తమిళంలో కూడా నటిస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణతో కల్సి శ్రీరామరాజ్యం సినిమాలో ఆమె చేసిన సీత పాత్ర ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసింది.
ప్రస్తుతం కాథువాకుల రెండ్ కాదల్ సినిమాలో నటిస్తున్న నయన్ ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ఓ సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నయన్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం పైగా చిత్రాల్లో నటిస్తున్నా సరే,ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ, ఆమె తన అందంతో, తన నటనతో ఎన్నో సినిమాలలో ఛాన్స్ లు దక్కించుకుంటోంది.
పైగా రెమ్యునరేషన్ కూడా ఎక్కువే అందుకుంటోంది. దీనికి ఓ ప్రధాన కారణం ఉంది. పాత్రకు ప్రాణం పోసే మూవీస్ ఎంచుకోవడం వల్లనే ఆమె ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. నిజానికి వయసులో ఉన్నప్పుడు ఎన్నో గ్లామర్ పాత్రలో నటించగా,వయసు మీద పడుతున్న కొద్దీ వయస్సుకు తగ్గట్టు పాత్రలు చేస్తూ తన ఇమేజ్ కాపాడుకుంటోంది.