కార్తీక దీపం సీరియల్ క్లైమాక్స్ వైరల్…నిజం ఏమిటో చూడండి
karthika deepam serial :బుల్లితెరపై సీరియల్స్ కి కొదవలేదు. ఎందుకంటే జనాల ఆదరణ అలాగే ఉంది. ఒక సీరియల్ ని మించి మరో సీరియల్ దూసుకుపోతుంటే, ఇక సీరియల్స్ లో నటించే నటీనటులకు కూడా క్రేజ్ విపరీతంగా వస్తోంది. ముఖ్యంగా బుల్లితెర సీరియల్ అనగానే స్టార్ మా లో ప్రసారమయ్యే కార్తీక దీపం టాప్ లెవెల్లో కొనసాగుతోంది. 2017 లో సెకండ్ హాఫ్ లో మొదలైన ఈ సీరియల్ ఇప్పటికీ హైయెస్ట్ టి.ఆర్.పి లను నమోదు చేస్తూ విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటికి 995 ఎపిసోడ్లు అయ్యాయి.
సోమవారం నుంచి శనివారం వరకూ సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ సీరియల్.. కోసం ఎదురుచూసే ఆడవాళ్లు చాలామందే ఉన్నారు. పనులు చక్కబెట్టు కుని చూసేవాళ్ళు, కొందరైతే, పనులు చేసుకుంటూ కార్తీకదీపం సీరియల్ వీక్షించే వాళ్ళు మరికొందరు. ఇక హాట్ స్టార్ సదుపాయం ఉన్న వాళ్ళు అయితే ఉదయాన్నే వీక్షిస్తు న్నారు. అంతలా టాప్ లెవెల్లో ఈ సీరియల్ దూసుకెళ్తోంది. సహజంగా ఇంతటి పాపులార్టీ గల సీరియల్స్ గురించి వెబ్ సైట్స్ లో ఇతర సోషల్ మీడియాలో పలు అంశాలు వైరల్ అవుతుంటాయి.
అయితే ఇప్పుడు ఈ సీరియల్ క్లైమాక్స్ కు వచ్చేసిందని వినిపిస్తోంది.నిజానికి మరో 400ల ఎపిసోడ్లు పైనే ఉంటుందట. అయినా క్లైమాక్స్ గురించి వైరల్ అవ్వడం ఈ సీరియల్ క్రేజ్ ని తెలుపుతోంది. దీప అలియాస్ వంటలక్క ను అనుమానించి దూరం పెట్టిన డాక్టర్ బాబు, తనకు పిల్లలు కలిగే భాగ్యం ఉందని తెలుసుకుని, దీపని క్షమించమని కోరడానికి వెళ్తాడట. కానీ చివర్లో వంటలక్క చనిపోతుందట. చివరికి పిల్లలు హిమ,శౌర్య లు తన తండ్రి వద్దకు చేరుతారని, విలన్ మౌనిత సూసైడ్ చేసుకుంటుందట. ఒక సీరియల్ కోసం ఇంతలా కథనాలు వైరల్ అవ్వడం మాములు విషయం కాదు. అందుకే ఇంకా క్రేజీ సీరియల్ గా ఉంది.