బాలీవుడ్ లో సత్తా చాటుతున్న దక్షిణాది తారలు…ఎంత మంది ఉన్నారో…?
Tollywood heroines :ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్స్ గా విరాజిల్లుతున్న పూజా హెగ్డే , రష్మిక మందన్న పోటాపోటీగా తమ సత్తా చాటుతున్నారు. ఎవరిది పైచేయి అనేది తేలడంలేదు. అంతలా ఒకరికొకరు హిట్ మీద హిట్ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నారు. సౌత్ సినిమాలతో తెరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత అక్షయ్ కుమార్ .. హౌస్‌ఫుల్ 4.. లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా చేస్తూ, ఇప్పటికే పూజా హెగ్డే బాలీవుడ్‌లో తానేమిటో చూపించింది.
కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, తెలుగుతో సత్తా చాటిన రష్మిక మందన్న తాజాగా బాలీవుడ్‌లో టాప్ టక్కర్ అనే ప్రైవేటు ఆల్బమ్‌తో బాలీవుడ్ ఆడియన్స్ ని అలరించింది. అంతేకాదు, పూజా హెగ్డే కంటే ఎక్కువ పాపులారిటీని రష్మిక మందన్న బాలీవుడ్‌లో దక్కించుకుంది. ఇపుడు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ గా, సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న మిషన్ మజ్ను సినిమాతో ఎంట్రీ ఇస్తోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో రష్మిక చేరింది. ఇక ఆల్బమ్ కి సంబంధించి తలపాగాతో రెండు చేతులు పెట్టి రష్మిక నవ్వుతూ ఉన్న ఫోటో చక్కర్లు కొడుతోంది. పైగా సోషల్ మీడియాలో ఎక్కువ మంది లైక్ చేసిన ఫోటోగా రికార్డు క్రియేట్ చేయడంతో బాలీవుడ్ ప్రేక్షకులు రష్మిక గురించి సెర్చ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం బాఘీతో తెరంగేట్రం చేసిన నగ్మా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సత్తా చాటింది.
‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ అసిన్.. ఆ తర్వాత గజినీ హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి సత్తా చాటింది. దేవదాసు సినిమాతో తెలుగులో హిట్ కొట్టిన ఇలియానా.. బర్ఫీ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇష్టం’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రియ బాలీవుడ్‌లో ‘తుజే మేరి కసమ్’ సినిమాలో నటించింది. ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ కన్నడ మూవీతో తెరంగేట్రం చేసి, యరియా హిందీ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఉత్తరాదికి చెందిన కాజల్ అగర్వాల్ 2004లో క్యూ హో గయా నా మూవీతో ఎంట్రీ ఇచ్చినా, ఆతర్వాత దక్షిణాదిన నెంబర్ వన్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. ఆ తర్వాత అజయ్ దేవ్‌గణ్ ‘సింగం’ సినిమాతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘స్పెషల్ 26’, దో లబ్జోంకీ కహాని’ వంటి పలు బీ టౌన్ సినిమాల్లో నటించింది.
కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ బాలీవుడ్ మూవీ ‘లక్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఉత్తరాది భామ తాప్సీ 2010లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి, 2013లో ఛష్మే బద్దూర్’ సినిమాతో బాలీవుడ్ లోకి వెళ్ళింది. వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్‌గా అక్కడ సత్తా చాటుతోంది.
ఇక సౌందర్య కూడా హిందీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘సూర్య వంశం’లో హీరోయిన్ గా చేసింది. జయసుధ కూడా ఈ మూవీలో చేసింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కర్తవ్యం హిందీ రీమేక్ ‘తేజస్వినీ’ తో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన.. ది జెంటిల్మెన్ హిందీ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. మీనా .. పరదా హై పరదా అనే ఒకే ఒక్క హిందీ సినిమాలో నటించింది.
సౌత్ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న చెన్నై బ్యూటీ త్రిష కూడా బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కట్టా మీటా సినిమాలో నటించింది. అలాగే ప్రియమణి కూడా హిందీలో రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, చెన్నై ఎక్స్‌ప్రెస్, మూవీస్‌లో నటించింది. తాజాగా అజయ్ దేవ్‌గణ్ మైదాన్ మూవీ చేస్తోంది. వాస్తవానికి ఇప్పుడంటే బాలీవుడ్ భామలు తెలుగులో నటిస్తున్నారు గానీ, ఒకప్పుడు బాలీవుడ్ లో దక్షిణాది తారలే తమ సత్తా చాటారు.
బాలీవుడ్ ఒకప్పటి డ్రీమ్‌గాళ్ హేమామాలిని కూడా సౌత్‌కు చెందిన నటే. తమిళనాడులో పుట్టి పెరిగిన ఈమె.. తెలుగులో ‘పాండవ వనవాసం’ సినిమాతో మెరిసింది. ఆ తర్వాత డ్రీమ్ గర్ల్‌గా బాలీవుడ్ లో సత్తా చాటింది. మహానటి సావిత్రి,జమున కూడా తమ అదృష్టాన్ని హిందీలో పరీక్షించుకున్నారు. ఇక వైజయంతి మాల మొదలుకొని రేఖ, శ్రీదేవి, జయప్రద, సుమలత, రాధ, భానుప్రియ, రాధిక, శాంతి ప్రియ, ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే, రమ్యకృష్ణ, రంభ ఇలా చాలామంది మంది భామలు సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి దుమ్మురేపారు.