ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి మీరా భర్త ఎవరో తెలుసా?
Prema Entha Madhuram Serial Actress Meera :సీరియల్స్ కి గల క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. అందరూ బాగా నటిస్తూ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నారు. ఇక జి తెలుగులో ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం సీరియల్ కి మంచి ఆదరణతో దూసుకెళ్తోంది. ఇక ఇందులో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్న మీరా తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఎంతోమంది ఫాన్స్ ని సంపాదించుకుంది.
స్వాతి చినుకులు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన మీరా అసలు పేరు అనూషా సంతోష్. మనసు మమత ,కుంకుమ పువ్వు వంటి సీరియల్స్ లో నటించినప్పటికీ ప్రేమ ఎంత మధురం సీరియల్ కి వచ్చిన గుర్తింపు దేనికీ రాలేదనే చెప్పాలి. స్వాతి చినుకులు సీరియల్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజుని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం కల్యాణ వైభోగం సీరియల్ లో నటిస్తున్న యాక్టర్ భావన సొంత తమ్ముడే నాగరాజు. ఇక భావన భర్త కూడా సీరియల్ డైరెక్టర్ గా ఉన్నాడు. ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ కి డైరెక్షన్ చేస్తున్నాడు. ఇలా మొత్తం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే కావడం విశేషం.