MoviesTollywood news in telugu

చెర్రీ వాచీ ఖరీదు ఎంతో తెలుసా…షాక్ అవ్వాలసిందే

Ram Charan Watch Price in telugu :స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సినిమా హిట్ ని బట్టి రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోవడంతో పాటు పలు యాడ్స్ లో కూడా చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న కాన్సప్ట్ లో ప్లాన్ వేసుకుంటున్నారు. దానికి తోడు ఖరీదైన ఇళ్లను నిర్మించుకోవడం, విలాసవంతమైన కార్లు, వస్తువులు కూడా వాడుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లోకి చిరుత మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి, డిఫరెంట్ మూవీస్ తో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు.

ప్రస్తుతం తండ్రి చిరంజీవి హీరోగా ఆచార్య మూవీ తీస్తూ అందులో కీలక పాత్ర కూడా పోషిస్తున్న రామ్ చరణ్ మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కల్సి ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీలో చేస్తున్నాడు. మేలో ఆచార్య, అక్టోబర్ లో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కాబోతున్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో కూడా చెర్రీ నటించబోతున్నాడు. కాగా ఈనెల 27న చెర్రీ బర్త్ డే సందర్బంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఈసందర్బంగా చెర్రీ ధరించిన వాచీ వైరల్ అయింది. వాచీ ఖరీదు ఏకంగా కోటి రూపాయల పైమాటే. అవును అక్షరాలా ఒక కోటి 9లక్షల 18వేల 566రూపాయలట. అలాగే అతడు ధరించిన బ్రాండెడ్ టీ షర్ట్ కోసం 76వేల రూపాయలు ఖర్చు చేసాడట. ఇవి వైరల్ కావడంతో ఫాన్స్ కామెంట్స్ కూడా అదరగొడుతున్నారు.