విజయం కోసం ఎదురు చూస్తున్న హీరోలు…ఎవరో చూడండి
Tollywood Stars :సినిమా పరిశ్రమలో ఎవరు హిట్ కొడతారు అనే విషయం చెప్పలేం ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే ప్లాప్ ఎదురవుతుంది. సినిమా హిట్టు కోసం చాలా మంది హీరోలు ఎదురుచూస్తున్నారు. వారు ఎవరు ఒక్కసారి చూద్దాం
పవన్ కళ్యాణ్ సర్దార్,కాటమరాయుడు,అజ్ఞాతవాసి సినిమాలతో ప్లాప్ అందుకున్నాడు. ఏప్రిల్ 9 వచ్చే వకీల్ సాబ్ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు
వరుస ఫ్లాపులతో ఉన్న నాని ఏప్రిల్ 23న వస్తున్న టక్ జగదీష్ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు
అక్కినేని వారసుడు అఖిల్ జూన్ 19 న విడుదల అవుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపై ఆశ పెట్టుకున్నాడు ఇప్పటివరకు నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
శ్రీకారం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ సినిమాకి మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం రాలేదు హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు
2019 బాలయ్యకు అస్సలు కలిసిరాలేదు. శాతకర్ణి తర్వాత ఈయన నటించిన పైసా వసూల్, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు బోయపాటి సినిమాపైనే ఈయన ఆశలన్నీ ఉన్నాయి.