MoviesTollywood news in telugu

అనుష్క వదులుకున్న క్రేజీ ఆఫర్లు…వదులుకోవటానికి కారణాలు ఇవే

Anushka Shetty Movies : ఒక్కోసారి వరుస సినిమాలు ఒప్పేసుకోవడం ద్వారా కొందరు బిజీ గా మారిపోతుంటే, మరికొందరు వచ్చిన ఛాన్స్ లు కూడా వదిలేసుకుంటున్నారు. అందులో యోగా భామ, స్వీటీ అనుష్క గురించి ముందుగా చెప్పాలి. తెలుగు,తమిళ భాషలతో పాటు హిందీలో కూడా 5,6 భారీ క్రేజీ చిత్రాల్లో ఛాన్స్ లు వస్తే అనుష్క తిరస్కరించిందట. ఇండియన్ సెల్యులాయిడ్ పై అద్భుత చిత్రాలు తీసిన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్, పైగా పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ కానున్న క్రేజీ చిత్రాల్లో పొన్నియిన్ సెల్వన్`మూవీ లో అనుష్క ను అడిగితె నో చెప్పేసిందట. దాంతో చెన్నై బ్యూటీ త్రిషకు ఛాన్స్ దక్కింది. ఇందులో విక్రమ్,జయం రవి,కార్తీ,జయరామ్,ఐశ్వర్య రాయ్ బచ్చన్,త్రిష ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. ప్రభు,విక్రమ్ ప్రభు,ఐశ్వర్య లక్ష్మి సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ దివంగత కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఫాంటసీ హార్రర్ చిత్రం అరుంధతి మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా ఏకంగా 10 నంది అవార్డులను కొట్టేసింది. ఆ సినిమాలో జేజమ్మగా అనుష్క నటించి అందరి మన్ననలు అందుకోవడమే కాదు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కూడా తాను సరిపోతానని చాటిచెప్పింది. అయితే అరుంధతి 2 త్వరలో సెట్స్ పైకి వెళుతుందని, సీక్వెల్ కోసం అనుష్కను అడిగితె ఆమె కాదన్నట్లు టాక్ నడిచింది. ఆ తర్వాత అరుంధతి 2 లో పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారని పుకార్లొచ్చాయి. అయితే అరుంధతి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఈ సీక్వెల్ నిర్మాత కాకపోవడం అసలు కారణం.

అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ యానిమేటెడ్ పాత్రతో రూపొందించిన కొచ్ఛాడయాన్ సినిమాకు రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. అనుష్క శెట్టి కాల్షీట్ల కారణంగా ఈ చిత్రాన్ని సున్నితంగా వదిలేయడంతో ఆ ప్లేస్ లో దీపికా పదుకొనే చేసింది.హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న అసురన్ తెలుగు రీమేక్ నారప్ప లో చేయమని అనుష్కను అడిగితె నో చెప్పేసింది. నిజానికి శ్రీయా శరణ్ ని అడగ్గా, ఆమె కాదనడంతో అనుష్క శెట్టి వైపు మొగ్గుచూపించారు. అయితే నిశ్శబ్ధంలో చేస్తున్న సమయంలో కాల్షీట్ల సమస్య వలన నారప్ప ఆఫర్ ను అనుష్క కాదనుకుంది