MoviesTollywood news in telugu

బ్రూస్ లీ యంగ్ విలన్ తండ్రి ఒకప్పటి హీరో… ఎవరో తెలుసా?

Amitash Pradhan :హీరోలకు ధీటుగా హ్యాండ్సమ్ గా ఉండే ఈ యంగ్ విలన్ అమితాష్ ప్రధాన్ తెల్సుగా. తమిళ, కన్నడ చిత్ర సీమలో డిమాండ్ గల నటుడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్రూస్ లీ చిత్రంలో విలన్ సంపత్ రాజ్ కొడుకు క్యారక్టర్ లో అదరగొట్టడమే కాదు, డబ్బింగ్ మూవీ రఘువరన్ బిటెక్ లో విలన్ గా సత్తా చూపించాడు. కేవలం నాలుగు చిత్రాలతో ఏకంగా హాలీవుడ్ ఛాన్స్ కోట్ఠాసాడంటే, ఇతగాడి టాలెంట్ గురించి చెప్పక్కర్లేదు. చాలా చిన్న కుర్రాడిగా కనిపించే ఇతని వయస్సు కేవలం 27 ఏళ్ళు . 1990అక్టోబర్ 12న చెన్నైలో జన్మించాడు. అమితాష్ ఇంతకీ ఎవరో తెలుసా, నాలుగు దశాబ్డల క్రితం తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించిన సంగీత నాట్య ప్రధాన చిత్రం సప్తపది లో హీరో గా నటించిన గిరీష్ కొడుకు.

కళాతపస్వి కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సప్తపదిలో ఫ్లూట్ కళాకారునిగా మురళి పాత్రలో గిరీష్ రాణించి, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాడు. కర్ణాటకకు చెందిన గిరీష్ అసలు పేరు గిరీష్ ప్రధాన్. బీఎస్సీ చదివిన ఆయన సినిమాల మీద ఆసక్తితో ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరి శిక్షణ పొందిన గిరీష్ కి తొలి చిత్రం కళాత్మక చిత్రం సప్తపది కావడంతో ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చాయి.

అయితే చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి షిఫ్ట్ అయినప్పుడు చెన్నైలోనే వుండిపోయిన గిరీష్, మెగాస్టార్ చిరంజీవికి మంచి మిత్రుడు. వీరిద్దరూ కల్సి మంచు పల్లకి మూవీలో నటించారు. అప్పట్లో గిరీష్ ని గిరు అని పిలవడంతో నీవు చిరు అంటూ చిరంజీవిని పిలిచాడట. ఆ విధంగా చిరు అని మొదటిసారి పిలిచింది గిరీషే. ఆ తర్వాత చిరు ముద్దు పేరు బాగుందని యూనిట్ సభ్యులంతా చిరు చిరు అని పిలవడం మొదలు పెట్టారట. ఆ ముద్దు పేరు చిరంజీవికి అలానే ఉండిపోయింది.

ఇక గిరీష్ పుస్తకాలూ ఎక్కువగా చదువుతూ ఉంటాడని తెల్సుకున్న చిరంజీవి అప్పట్లో మద్రాసులో కడ్తున్న ఇంట్లో లైబ్రరీ డిజైన్ చేసే బాధ్యతను గిరీష్ కి అప్పగించాడు. అంతటితో ఆగకుండా తన అభిరుచికి అనుగుణంగా ఎలాంటి బుక్స్ కావాలో గిరీష్ తో లిస్ట్ రాయించారట. ఇప్పటికీ ఇద్దరి మధ్యా మంచి సంబంధాలున్నాయి.

చెన్నైలో గిరీష్ ఫార్మా ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. గిరీష్ భార్య పేరు వీణా ప్రధాన్. వీరికి అమితాష్ ఒక్కడే కొడుకు. అన్నా యూనివర్సిటీ కోర్సులో ఎలక్ట్రానిక్ మీడియా కోర్సులో పిజి చేసాడు. మొదట్లో స్టేజి నాటకాలతో గుర్తింపు తెచ్చుకున్న అమితాష్, ఆ తర్వాత ధనుష్ హీరోగా నటించిన రఘువరన్ బిటెక్ లో కూల్ గా వుండే విలన్ పాత్రలో జీవించాడు. తెలుగులో కూడా బ్రూస్ లీ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించాడు. ఇక ఈ సమయంలోనే హాలీవుడ్ ఛాన్స్ లు రావడాంతో అమెరికా వెళ్ళాడు.