సింగర్ మధుప్రియ లైఫ్ స్టైల్…అసలు నమ్మలేరు
singer madhu priya :మా మ్యూజిక్ లో అతి తక్కువ వయస్సులోనే అంటే 9ఏళ్లకే ఆడపిల్ల నమ్మా సాంగ్ తో ఫార్మ్ లోకి వచ్చేసిన సింగర్ మధుప్రియ కి ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువే. 2008లో పాడిన ఈ సాంగ్ తో ఎక్కడలేని రేంజ్ ఆమెకు వచ్చేసింది. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో 1997ఆగస్టు 26న మల్లేష్, సుజాత దంపతులకు జన్మించిన మధుప్రియ పూర్తిపేరు పెద్దింటి మధుప్రియ. ఇప్పుడు ఈమెకు 24ఏళ్ళు నిండుతాయి. ఈమెకు ఒక అక్క,ఓ చెల్లి ఉన్నారు.
కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో అలాగే జూనియర్ కాలేజీ లో మధుప్రియ చదివింది. చిన్నప్పటి నుంచి తెలంగాణా సాంగ్స్ పాడడం హాబీగా పెట్టుకుంది. అయితే ఎన్ని పాటలు పాడినా సరే, రానిపేరు సొంతంగా రాసుకుని పాడిన ఆడపిల్లనమ్మా సాంగ్ కి వచ్చింది. చాలా సినిమాల్లో పాటలు పాడే ఛాన్స్ రావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుప్రియ 2013న శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుంది.
దాదాపు 2కోట్ల రూపాయల నెట్ వర్త్ గల మధుప్రియకు చాలా కాస్ట్లీ కారుంది. 5అడుగుల 7అంగుళాల ఎత్తు గల ఈమె 55కిలోల బరువు ఉంటుంది. తెలుగు,హిందీ,ఇంగ్లీషు భాషలు వచ్చు. కె విశ్వనాధ్ తీసిన శంకరాభరణం మూవీ అంటే ఇష్టమట. జూనియర్ ఎన్టీఆర్, సమంత అంటే ఈమెకు ఇష్టం. డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఇళయరాజా అంటే ఇష్టం. సింగర్స్ లో ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం, శ్రేయ గోషేల్ అంటే ఇష్టం.