MoviesTollywood news in telugu

శ్రీకాంత్ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu heroine shruthi raj :టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన తమిళ బ్యూటీ శృతి రాజ్ ప్రస్తుతం ప్రముఖ తమిళ ఛానల్ సన్ టీవీలో ప్రసారమయ్యే ధారావాహికలో ప్రాధాన్యత గల పాత్రలో నటిస్తోంది. తెలుగులో అప్పట్లో ప్రసారమయ్యే శ్రావణి సుబ్రహ్మణ్యం అనే ధారావాహికలో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగా దగ్గరైంది. తెలుగు లో సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన ఓ చిన్నదాన మూవీలో హీరోయిన్ గా చేసి, తెలుగు ఆడియన్స్ ని అలరించిన శృతి రాజ్ ఆతర్వాత పలువురి స్టార్ హీరోల చిత్రాలలో నటించే ఛాన్స్ పోగొట్టుకుందని అప్పట్లోనే టాక్ నడిచింది.

నిజానికి వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన వీడెక్కడి మొగుడండీ అనే తెలుగు మూవీ ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ఓ చిన్నదాన చిత్రంతో మంచి హిట్ కొట్టినా, వ్యక్తిగత కారణాల వల్ల సినిమా పరిశ్రమకి దూరమైనప్పటికీ తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బాగానే రాణించింది. శృతి రాజ్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందమైన ఫోటోలకి ఫోజులు ఇస్తోంది.

అలాగే తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో చాలామంది నెటిజన్లు ఈ బ్యూటీ అందాలకి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా మూడు లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు. 40 ఏళ్ళ వయస్సులో కూడా వన్నె తరగని అందంతో శృతి రాజ్ అదిరిపోతోందని Tకొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శృతి రాజ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.