ఈ ఫొటోలో రజినీ కాంత్ తో ఉన్న స్టార్ హీరోని గుర్తు పట్టారా…?
Hrithik roshan and rajinikanth :నటనలో స్టైల్ క్రియేట్ చేసిన నటుడు అనగానే మనందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ గుర్తొస్తాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగులో చిరంజీవి తన టాలెంట్ తో ఎలా మెగాస్టార్ అయ్యాడో తమిళంలో కూడా రజనికాంత్ ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా రజినీ కాంత్ కు సినిమా రంగంలోని అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సినిమాల ద్వారా కంటే తన వ్యక్తిత్వంతోనే అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. చిత్ర సీమలో ఎన్నో మెట్లు అధిరోహించినప్పటికీ మొదటి మెట్టును మర్చిపోని నటుడు. ఇప్పుడు అత్యున్నత పురస్కారం రావడంతో దేశంలోని నటులు,దర్శకులు,అభిమానుల నుండి పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిసింది. ఇక బాలీవుడ్ నటీ నటులు కూడా రజినీకాంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక తాజాగా రజినీకాంత్ ఓ చిన్నారిని హత్తుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో ఇతడి గురించి సెర్చ్ చేస్తున్నారు. అయితే మిమ్మల్ని నేను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగా. మీరు రోజు రోజుకు ఎదుగుతూ ఉన్నారు’ అని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్బంగా రజినీకాంత్ తో ఉన్న చిన్నారి, ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఈ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు