పవన్ 15 సినిమాల వెనక అసలు కథ తెలిస్తే షాక్ అవ్వాలసిందే
Pawan Kalyan Movies :ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి బ్రదర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానులు ఆరాధిస్తుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు బ్రాండ్ అని చెబుతారు. ఇక పవన్ చాలా ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అంటూ ఒక నిర్మాణ సంస్థ నెలకొల్పగా, ఆ బ్యానర్ లో అప్పుడప్పుడు చిన్నా చితకా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఆ సినిమాల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.
నిజానికి ఇప్పటి వరకు పవన్ నిర్మాణంలో వచ్చిన సినిమాలకు పెట్టుబడి ఏమీలేదు. కేవలం ఆయన పేరే పెట్టబడిగా ఇతర నిర్మాతలు పెట్టుబడి పెట్టి సినిమాలు తీశారు. తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా పవన్ తో ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు టాక్. ఎందుకంటే, ఇటీవల వరుసగా సినిమాలు నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా 15 మూవీస్ తీయడానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో 6 తక్కువ బడ్జెట్ మరో 6 మీడియం రేంజ్,3 భారీ బడ్జెట్ మూవీస్ నిర్మించేందుకు పీపుల్ మీడియా దాదాపు 150 కోట్ల రూపాయలు పెట్టబోతున్నారట.
ఇంతకీ పవన్ ఒక్క రూపాయి కూడా లేకుండానే ఈ సినిమాలన్నింటికి నిర్మాతగా మారబోతున్నాడు. ఇంతకీ పవన్ ఒక్కడే కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ ఒప్పందంలోకి రానున్నట్లు టాక్ అయితే తన బ్రాండ్ వాడుకుంటున్నందుకు భారీ మొత్తంలో ఆదాయం ఇవ్వబోతోఉన్నారట. ముందుగా ఇచ్చిన మొత్తంతో పాటు సినిమాలు విజయం సాధిస్తే లాభాల్లో వాటా కూడా పవన్ కు ఇస్తారు. ఈ మొత్తం సినిమాల్లో కొన్ని సక్సెస్ అయిన పవన్ కు మొత్తంగా వంద కోట్లకు మించి ఆదాయం వస్తుందని టాక్.