తుపాకీ సినిమాలో విజయ్ చెల్లి ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Telugu Heroine sanjana sarathy :ఓ పక్క హీరోగా మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఏ పాత్ర వచ్చినా చేయడానికి ఇప్పుడు చాలామంది నటులు సిద్ధంగా ఉంటున్నారు. తెలుగులో నవీన్ చంద్ర హీరోగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇక నవీన్ చంద్ర ఓ వైపు చిన్న సినిమాలలో హీరోగా నటిస్తూ, పెద్ద సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయిపోయాడు. కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ విలన్ గా రాణిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఇక త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీలో కూడా నవీన్ చంద్రని కన్ఫర్మ్ చేశారట.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా చేసిన తుపాకీ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో విజయ్ రెండో చెల్లిలి పాత్రలో నటించిన సంజనా సారథి అప్పట్లో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తొమ్మిదేళ్ళ క్రితం వచ్చిన ఆమూవీలో స్కూల్ గర్ల్ పాత్రలో కనిపించిన సంజనా ఇప్పుడు నవీన్ చంద్ర సరసన హీరోయిన్ గా సెలక్ట్ చేసారు.
టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ అవికాగోర్ ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీలో నవీన్ చంద్ర సోదరిగా మెరుస్తుందని అంటున్నారు. ఈ సినిమా ద్వారా ఓ కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తయి,పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న ఈ సినిమా విశేషాలు త్వరలో వెల్లడి కానున్నాయి.