చెల్లెలి కాపురం హీరోయిన్ లైఫ్ స్టైల్….ఎన్ని కోట్ల అస్థి..?
chelleli kapuram serial heroine :చెల్లెలి కాపురం హీరోయిన్ శిరీష దామెర సెప్టెంబర్ 17న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల లో జన్మించింది. ఈమె తండ్రి హోటల్ నిర్వహించేవారు. ఆయన ఇప్పుడు లేరు. తల్లితో పాటు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్స్ కూడా ఇండస్ట్రీలో ఉంటూ సక్సెస్ అయ్యారు. 9వరకూ సిరిసిల్లలో చదివి, టెన్త్ నుంచి హైదరాబాద్ లో చదివింది. నటన అంటే భయపడే శిరీష కాలేజ్ డేస్ లో ఉండగా సీరియల్స్ లో ఛాన్స్ వచ్చింది.
దూరదర్శన్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి శిరీష పరిచయం అయింది.మొగలి రేకులు, కృష్ణావతారాలు, అనామిక,మనసు మమత,కలవారి కోడలు వంటి 15 సీరియల్స్ లో చేసింది. నవీన్ వల్లభనేనితో పెళ్లయింది. 2009అక్టోబర్ 7న వీరికి ఓ బాబు పుట్టాడు.
హైదరాబాద్ మణికొండలో నివసించే శిరీష 5అడుగుల 10అంగుళాల పొడవు ఉంటుంది. రెండు అధునాతన కార్లున్నాయి. ఈమెకు ఇష్టమైన హీరోయిన్ భానుప్రియ. అభిమాన హీరో మహేష్ బాబు. ప్రస్తుతం చెల్లెలి కాపురం సీరియల్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. సంపాదన కూడా బాగానే ఉంది. సిరియల్స్ లో చాలా బిజీగా ఉంది.